Pet Dog : కుక్కను పెంచుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

పెంపుడు జంతువు అంటే ముందువరసలో ఉండేది కుక్క. అటువంటి కుక్క గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. పెంచుకునే కుక్క రంగు విషయంలో కూడా కొన్ని సూచనలు చెబుతున్నారు.

Pet Dog : కుక్కను పెంచుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

Benefits With Pet Dog

Updated On : October 17, 2023 / 1:42 PM IST

Benefits With Pet Dog : పెంపుడు జంతువు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కుక్క. చాలామంది కుక్కల్ని పెంచుకుంటారు. ఎందుకు…? అని అంటే ఇష్టమనో..సరదాకనో..సేఫ్టీ కోసమనో చెబుతారు. కానీ కుక్కలను పెంచుకుంటే కలిగే లాభాల గురించి మాత్రం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు.అవేంటో తెలుసుకుందాం..

విశ్వాసానికి మారుపేరు అయిన కుక్కను చాలామంది పెంచుకుంటారు.యజమానుల కోసం తమ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టే కుక్కలు..యజమాని భద్రత విషయంలో చాలా అలర్ట్ గా ఉంటాయి. ఇలా కుక్కల గురించి చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. కానీ కుక్కల వల్ల ఇంటికి చాలా ఉపయోగాలున్నాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కుక్క ఇంటికి కాపలా కోసమే కాదు మానసిక ఆనందాన్ని కూడా ఇస్తుందని మానసిక నిపుణులు సూచిస్తుంటారు. ఒత్తిడి కలిగినప్పుడు పెంపుడు జంతువులతో ఆడుకుంటే రిలీఫ్ కలుగుతుందని చెబుతారు.

సాధారణంగా పెంపుడు జంతువు అంటే ముందువరసలో ఉండేది కుక్కే. అటువంటి కుక్క గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయట.పెంచుకునే కుక్క రంగు విషయంలో కూడా కొన్ని సూచనలు చెబుతున్నారు. కుక్కను పెంచుకోవడం ఇంటికి శుభప్రదమట. పురాణాల్లో కూడా కుక్కల ప్రస్తావన ఉన్న విషయం తెలిసిందే. కుక్కను కాలభైరవుడిగా పేర్కొంటారు. కాల భైరవుడి పూజ చాలా విశిష్టమైనది చెబుతుంటారు పండితులు.

Blue Ocean Dosa : నీలి సముద్రంలాంటి ‘బ్లూ దోశ’ .. తింటే వన్స్ మోర్ అనాల్సిందేనట..!

అటువంటి కుక్క శని దేవుడి అనుగ్రహాన్ని కలిగిస్తుందట. ప్రతీరోజు కుక్కకు కడుపు నిండా ఆహారం పెడితే శని దేవుడు అనుగ్రహిస్తాడట. శని దోషం కలుగకుండా ఉంటుందట. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన తరువాత కుక్కను చూస్తే శుభాలు కలుగతాయట.కుక్కను పెంచుకుని దాన్ని ప్రేమగా ఆదరిస్తే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట..

చాలామంది కుక్కును పెంచుకునే విషయంలో కుక్క అందంగా ఉండాలనుకుంటారు. బొచ్చు కలిగి ఉంటే అందంగా ఉంటుందని చాలామంది అటువంటి కుక్కల్ని పెంచుకోవటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే  నల్ల కుక్కను పెంచుకోవటానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే నలుపు మంచిదికాదని అనుకుంటారు. కానీ నల్ల కుక్కను పెంచుకోవటం మంచిదట. నల్ల కుక్కను పెంచుకుంటే రాహు, కేతులు, శని గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో చక్కటి ఉపయోగాలు కలుగుతాయట.

Home : గుమ్మం ముందు విడిచిన చెప్పులు తిరగబడి ఉంటే ఎన్ని అనర్ధాలో తెలుసా…?

కుక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఎందుకంటే కుక్క ఇంట్లో సందడి సందడిగా తిరుగుతుంటుంది. ఇంట్లో ఉత్సాహం ఉంటే పాజిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..నెగిటివ్‌ ఎనర్జీ పోయినట్లే.మనలో పాజిటివ్‌ ఎనర్జీ పెరగాలంటే..పెంపుడు కుక్కతో కాసేపు ఆడుకుంటే శరీరానికి చక్కటి వ్యాయామం కలుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో ఎనర్జీ పెరుగుతుంది.

పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే అన్నీ పాజిటివ్‌గా ఉంచుకోవాలి. అంటే మంచి ఆలోచనలు చేయాలి. కుక్కలు గుప్పెడు మెతుకులు పెడితే చాలు విశ్వాసంగా ఉంటాయి. కప్పు పాలు పోస్తే చాలు తోక ఊపుకుంటూ మన వెంటనే తిరుగుతాయి. కుక్కలు ఆనందాన్ని కలిగించటమేకాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని కుక్కల్ని పెంచుకోవటం మంచిదని చెబుతున్నారు వాస్తు నిపుణులు.