Home : గుమ్మం ముందు విడిచిన చెప్పులు తిరగబడి ఉంటే ఎన్ని అనర్ధాలో తెలుసా…?

డపను గౌరిదేవిగా పిలుస్తారు. అందుకే గడపలకు పసుపు రాసి కుంకుమ పెడతారు. అటువంటి గడప వద్ద చెప్పులు విడవకూడదని..చీపురులాంటివి పెట్టకూదని పెద్దలు చెబుతుంటారు. అలా విడిచే సయమంలో చెప్పులు తిరగబడి ఉంటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Home : గుమ్మం ముందు విడిచిన చెప్పులు తిరగబడి ఉంటే ఎన్ని అనర్ధాలో తెలుసా…?

slippers and shoes in reverse angle

Home vastu tips : ప్రతీ ఇంటికి ప్రధాన ద్వారానికి గడప ఉంటుంది.గడపను గౌరిదేవిగా పిలుస్తారు. అందుకే గడపలకు పసుపు రాసి కుంకుమ పెడతారు. అటువంటి గడప వద్ద చెప్పులు విడవకూడదని..చీపురులాంటివి పెట్టకూదని పెద్దలు చెబుతుంటారు. కానీ బయటకు వెళ్లి వచ్చిన ప్రతీవారు గుమ్మం ముందే చెప్పులు విడిచి లోపలికెళతారు. అలా మనం ఇంటిముందు లేదా గుమ్మం ముందు చెప్పులు విడిచే సమయంలో కంగారుగానో లేదో వేరే ఏదన్నా ధ్యాసలోనే ఉండి హడావిడిగా విడిచి లోపలికి వెళ్లిపోతుంటాం.

చెప్పులు విషయంలో నిర్లక్ష్యం వద్దు..
కొంతమంది చెప్పులు విడిచేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా విసిరినట్లుగా పడేస్తుంటారు. అటువంటప్పుడు చెప్పులు తిరగబడుతుంటాయి. లేదా రెండు చెప్పులు పక్క పక్కన కాకుండా వేరు వేరుగా పడేస్తుంటారు. లేదా తిరబడి పడినా పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోతుంటాం. కానీ చెప్పుల్ని నిర్లక్షంగా విడవకూడదని..చెప్పులు తిరగబడి ఉండకూడదని చెబుతున్నారు పండితులు..వాస్తు నిపుణులు. ఇంకా సాధ్యమైతే అసలు గడప వద్ద చెప్పువు విడిచి ఉంచకూడదని సూచిస్తున్నారు.

నిర్మాణాల విషయంలో వాస్తు శాస్త్రంలో చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఏ గుమ్మం ఎక్కడుండాలి.. ఏ కిటికీ ఏ దిశలో ఉండాలి..?బెడ్ రూమ్, కిచెన్, దేవుడు గది ఏవి ఎక్కడుండాలో నియమాలుంటాయి. అలాగే ఇంట్లో ఉండే ముఖ్యమైన వస్తువు ఎక్కడుండాలి..?ఏది ఎక్కడ పెట్టకూడదు.. . అనే విషయంలో చాలా నియమాలుంటాయి. అలా ఇష్టానురీతిగా ఉంటే ప్రతికూల ప్రభావాలుంటాయని హెచ్చరిస్తుంటారు. ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుందని చెబుతుంటారు.

Dussehra 2023 : పాండవులకు పాలపిట్టకు సంబంధమేంటి..?దస‌రా రోజు పాల‌పిట్ట‌ను ఎందుకు చూడాలి..?

ఆరోగ్య సమస్యలు..
వాస్తు శాస్త్రంలో బూట్లు, చెప్పులు వంటివి పాదరక్షలు సరైన స్థలంలో ఉంచాలని చెబుతున్నారు. సరైన ప్రాంతంలో ఉండకపోతే ఆ ఇంట్లో నివసించేవారికి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వాస్తు ప్రకారం.. ఇంట్లో బూట్లు, చెప్పులు పక్కకి లేదా తలక్రిందులుగా పడేసినట్లైతే అది పొరపాటుగా అయినా సరే లక్ష్మీదేవికి కోపమొస్తుందట. ఆర్థిక సమస్యలతో పాటు అన్ని సమస్యలు వస్తాయట. కాబట్టి బూట్లు, చెప్పులు ఎప్పుడూ ఇంటిలోపల ఉంచకూడదు. అలాగే గుమ్మం ముందు అంటూ గడప వద్దగానీ విడవకూడదట.

ఇంట్లో చెప్పులు లేదా బూట్లను తలకిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో గ్రహాల దుష్టప్రభావం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గడపను గౌరీదేవిగా భావిస్తాం కాబట్టి గౌరీ మాతకు.. లక్ష్మిదేవి కూడా ఆగ్రహం కలుగుతుందట. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదు.. తనకు అవమానం జరిగిందని వెళ్లిపోతుందట. కాబట్టి ఆర్థిక సమస్యలు వస్తాయట.

అనారోగ్య కారణాలకు కూడా కారణం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారం వద్ద తలకిందులుగా చెప్పు ఉంచితే ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందట.చెడు ప్రభావంతో ఇంట్లో అనారోగ్యం, బాధలు ఉంటాయట. కాబట్టి చెప్పులు అక్కడ పెట్టకుండా ఉంటే మంచిది. పెట్టినా చెప్పులుగానీ బూట్లు గానీ తిరబడకుండా ఉండేలా జాగ్రత్తగా గడపకు దూరంగా విడివాలి.

ఇంట్లో ప్రతికూలత 
జ్యోతిష్యం ప్రకారం.. ఎప్పుడూ చెప్పులు, బూట్లు తలకిందులుగా అస్సలు ఉంచకూడదు. అలా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పోయి నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. తిరగడి ఉండే బూట్లు, చెప్పులు కుటుంబ ఆనందానికి చేటు తెస్తాయని..అశాంతికి కారణమవుతాయని చెబుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు చెప్పులు గుమ్మం బయట కాకుండా దూరంగా స్టాండ్ లో విడిస్తే మంచిది. ఒకవేళ కంగారుగానో..టైమ్ లేకనో పొరపాటుగానో ఉంచాల్సి వస్తే సక్రమంగా రెండు పొందికగా ఉండేలా గడపకు కాస్త దూరంగా పెడితే మంచిదని చెబుతున్నారు.