Blue Ocean Dosa : నీలి సముద్రంలాంటి ‘బ్లూ దోశ’ .. తింటే వన్స్ మోర్ అనాల్సిందేనట..!

బ్లూ దోశ అంటూ కష్టమర్లను తనవైపు ఆకట్టుకుంటున్నాడు ఓ దోశవాలా. అతను వేసే దోశ చూస్తే అది దోశా.. లేదా నీలి రంగు ఆకాశమా.. లేదా నీలి రంగు సముద్రమా..? అనిపిస్తోంది..తిన్నవారు వాటే టేస్ట్ అంటున్నారట..

Blue Ocean Dosa : నీలి సముద్రంలాంటి ‘బ్లూ దోశ’ .. తింటే వన్స్ మోర్ అనాల్సిందేనట..!

street food recipe blue dosa

Blue Ocean Dosa raipur : ప్లెయిన్ దోశ,ఆనియన్ దోశ,మసాలా దోశ, పంచకట్టు దోశ, ఉప్మా దోశ,చీజ్ దోశ, ఆఖరికి ఎమ్మెల్యే దోశ, ఎంపీ దోశ ఇలా దోశల్లో వందకుపైగా రకాలున్నాయి. గ్రీన్ దోశ, రెడ్ దోశ అంటూ ఆకు కూరలు, బీట్ రూట్ లతో చేసే దోశలకు మంచి డిమాండ్ ఉంది. కానీ తాజాగా ఓ దోశ వాలా ఓ వెరైటీ దోశతో ఆకట్టుకుంటున్నాడు. కష్టమర్లను ఫిదా చేస్తున్నాడు. తనదైన స్టైల్లో ‘నీలిరంగు దోశ’తో వావ్ అనిపించుకుంటున్నాడు.

పుడ్ వ్యాపారానికి ఎప్పుడు పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే తమదైన స్టైల్ క్రియేట్ చేసుకోవాల్సిందే. తమదైన స్టైల్ తో ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకోవాలి. అలాగైతేనే పోటీని తట్టుకుని నిలబడగలుగుతారు.పైగా ఈ ఫుడ్ వెరైటీలు మాగ్జిమమ్ రోడ్ సైడ్ లోనే ఉంటాయి. గత కొంతకాలంలో ట్రక్ లపై బ్రేక్ ఫాస్ట్ లు కష్టమర్లకు రుచితో పాటు తక్కువ ధరకే అందించేందుకు పోటీ పడుతున్నారు.

Assembly Elections 2023 : ఓటర్లకు నోరూరించే స్వీట్ ఆఫర్, ఓటు వేస్తే జీలేబీలు ఫ్రీ .. ఎక్కడంటే .. ?

అలా ఎంతోమంది బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ తో ఆకట్టుకుంటు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో కొంతమంది మాత్రం కష్టమర్లను ఆకట్టుకునే విషయంలో తమ మార్క్ క్రియేట్ చేసుకుంటుంటారు. అటువంటివారిలో ఇదిగో ఈ ఫుడ్ వాలా ఒకరిగా నిలిచారు. క్రియేటివిటీ ఉంటే సరిపోదు దానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూడా ఓ చక్కటి పబ్లిసిటీగా మారుతోంది ఇటీవల కాలంలో.

సరిగ్గా అదే ట్రెండ్ ను ఫాలో అయ్యాడీ దోశవాలా. బ్లూ దోశ అంటూ కష్టమర్లను తనవైపు ఆకట్టుకుంటున్నాడు. అతను వేసే దోశ చూస్తే అది దోశా.. లేదా నీలి రంగు ఆకాశమా.. లేదా నీలి రంగు సముద్రమా..? అనిపిస్తోంది.

ఈ బ్లూ దోశలో సీజ్, టమాటో సాస్, స్వీట్ కార్న్ తో పాటు రకరకాల పదార్ధాలు వేసి మరీ చూడగానే నోరూరించే ‘బ్లూ దోశ’ను క్షణాల్లో చేసి ప్లేట్ లో పెట్టి మూడు రకాల చట్నీలతో అందించేస్తున్నాడు రాయపూర్ కు చెందిన దోశవాలా. ఆ దోశ తిన్నవారు కూడా వార్ బ్లూ దోశ..వాటే టేస్టీ అంటున్నారట..Instagram ఖాతా @khate_raho_dilseలో పోస్ట్ చేసిన ఈ బ్లూ దోశ తెగ వైరల్ అవుతోంది. ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతున్న ఈ ‘బ్లూదోశ’పై మీరు కూడా ఓలుక్కేయండీ..