Microbial Insecticides : రైతు స్థాయిలో సూక్ష్మ జీవన క్రిమి సంహారాల తయారీ

మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీట కాలు చనిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతోంది. ఈ అంశాలన్నింటిపై రైతులను వ్యవసాయాధికారులు చైతన్యపరుస్తూ పకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు.

Microbial Insecticides : రైతు స్థాయిలో సూక్ష్మ జీవన క్రిమి సంహారాల తయారీ

Organic Farming

Microbial Insecticides : పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆ ధారపడాల్సి వస్తోంది. అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టు బాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అందుకే రైతులు సొంతంగా ఎరువులు, కషాయాలు తయారుచేసుకొని ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీట కాలు చనిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతోంది. ఈ అంశాలన్నింటిపై రైతులను వ్యవసాయాధికారులు చైతన్యపరుస్తూ పకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లా,  గోసపాడు మండలం, జిల్లెల్ల గ్రామానికి చెందిన రైతు బాల మద్దిలేటి కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మొదట దేశీ వరి రకాలను సాగుచేసేవారు. అయితే దిగుబడి తక్కువగా వచ్చినా… వెనుకడుగు వేయలేదు.. రసాయన ఎరువులు, పురుగు మందుల జోలికి పోలేదు.. సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువులు, కషాయాలతో సాగుచేస్తూ.. వస్తున్నారు.

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

ప్రస్తుతం రసాయన ఎరువులతో సాగుచేసే రైతులకు ధీటుగా దిగుబడులు తీస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు వస్తున్నాయి. వచ్చిన దిగుబడులను స్వయంగా మార్కెట్  చేసుకొంటూ.. అధిక ఆదాయం పొందుతున్నారు. సహజ సిద్ధంగా పండించిన దేశశాళి వరి విత్తనాలు అమ్మడమే కాకుండా ధాన్యన్ని బియ్యంగా మార్చి అమ్ముతూ.. అధిక లాభాలను గడిస్తున్నారు. మరోవైపు మణికంఠ వర్మీ కంపోస్ట్ పేరుతో వర్మీకంపోస్ట్, వేపపిండి, ఆముదం పిండి, కషాయాలు, వేపనూనె తయారు చేసి కావాల్సిన రైతులకు అమ్ముతున్నారు. తద్వారా అదనపు లాభాలు గడిస్తున్నారు.

READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !

రైతు మద్దిలేటి సాగును చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తద్వారా పెట్టుబడులు పూర్తిగా తగ్గడమే కాకుండా ఆరోగ్యమైన అధిక దిగుబడులను తీస్తున్నారు. ప్రకృతి విధానంలో పండించి తినడం ద్వారా ఆరోగ్యం కూడా బాగుందని చెబుతున్నారు.