Groundnut Farming : వేరుశనగలో అధిక దిగుబడులకోసం మెళకువలు
వేరుశనగ సాగులో సగటు వుత్పత్తి మన ప్రాంతంలో 5 నుండి 6క్వింటాళ్లకు మించటంలేదు. దీనికి ప్రధానంగా వేరుశనగలో ఆయాప్రాంతాలకు అనుగణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవటం, యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

Groundnut Farming
Groundnut Farming : ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసిన వేరుశనగ వీస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. పంట చేతికొస్తుందని రైతులు భావిస్తున్న తరుణంలో అధిక వర్షాలు చాలావరకు పంటను దెబ్బతీసాయి. చూస్తుండగానే రబీకాలం వచ్చేసింది. ఇప్పుడు వేరుశనగను సాగుచేయలంటే నీటిసౌకర్యం తప్పనిసరిగా వుండాలి. ప్రస్తుతం భూగర్భ జలాలు, జలాశయాల్లో నీరు ఆశాజనకంగా వుండటంతో రైతులు వేరుశనగ సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే రబీ వేరుశనగలో అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన మేలైనన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
READ ALSO : Meta : యువతను చెడగొడుతున్నాయి.. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థపై 40 రాష్ట్రాలు దావా
వేరుశనగ సాగులో సగటు ఉత్పత్తి మన ప్రాంతంలో 5 నుండి 6క్వింటాళ్లకు మించటంలేదు. దీనికి ప్రధానంగా వేరుశనగలో ఆయాప్రాంతాలకు అనుగణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవటం, యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వర్షాధార వ్యవసాయంలో రైతుకు కొన్ని ఇబ్బందులు వున్నా… రబీలో నీటిపారుదల కింద చేపట్టే యాజమాన్యం, పూర్తిస్థాయిలో రైతు నియంత్రణలో వుంటుంది.
READ ALSO : Devaragattu : రణరంగంగా మారిన దేవరగట్టు కర్రల సమరం, ముగ్గురు మృతి, 100మందికి పైగా గాయాలు
కనుక రబీ వేరుశనగసాగులో మంచి ఫలితాలు పొందే వీలుంది. సాధారణంగా మనకు అందుబాటులో వున్న రకాలన్నీ 12క్వింటాళ్లకు పైబడి దిగుబడి నిస్తున్నాయి. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించే అవకాశం వుంది. రబీ వేరుశనగలో అధిగ దిగుబడి కోసం పాటించాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డా. రంజిత ద్వారా తెలుసుకుందాం.
READ ALSO : Rana Daggubati : చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా ‘మెగా 156’లో విలన్‌గా రానా దగ్గుబాటి? బాహుబలిని మించి..
వేరుశనగ పంటకు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తేముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. అలాగే పంట ఏపుగా పెరిగేందుకు దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు అందించాలి. వేరుశనగ పంట పూత సమయంలో లేదా కలుపు తీసే సమయంలో జిప్సంను తప్పనిసరిగా వేయాలి. ఈ దశలో వేరుశనగ ఊడలు అభివృద్ధి చెందే దశలో వుంటుంది. జిప్సం వేయటం వల్ల మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగటంతోపాటు, గింజల్లో నూనె శాతం పెరుగుతుంది.