Home » Groundnut Farming
వేరుశనగ సాగులో సగటు వుత్పత్తి మన ప్రాంతంలో 5 నుండి 6క్వింటాళ్లకు మించటంలేదు. దీనికి ప్రధానంగా వేరుశనగలో ఆయాప్రాంతాలకు అనుగణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవటం, యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
ఖరీఫ్‌లో వేరుశనగ పంటను జూలై రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును. ఈ వంటను యానంగిలో అక్టోబరు రెండవ పక్షంలోపు, సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును.
తెగులు ఆశించిన మొక్క మొదళ్ళలోని శాఖలు, ఊడలు ఎండిపోతాయి. ఆశించిన మొక్కలను పీకినపుడు నేలపై ఉన్న పైభాగాలు మాత్రమే ఊడివస్తాయి. వేర్లు మరియు కాయలు నేలలోనే ఉండిపోతాయి.
ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అనగా తామర పురుగు, పచ్చదోమ,పేనుబంక , అకు తినే పాగాకు లద్దెపురుగు, ఆకుమడత పురుగు, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.
ముఖ్యంగా వేరుశనగ పంటలో తెగుళ్లు వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంట, వేసిన 25-30 రోజులకే మొక్కలు చనిపోతున్నాయి . ఈ పరిస్థితులను అధిగమించాలంటే విత్తనం వేసేముందు విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలి.
పూర్తిగా ఎదిగిన మొక్కల్లో తెగులు వచ్చిన వెంటనే ఆకులు చిన్నవిగా అయి లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి పాలిపోయి ఉంటాయి. లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయి. ముదురు ఆకుల్లో ఈ లక్షణాలు కనిపించవు.
విత్తనం కొరకు ఉంచిన వేరుశనగను, కాయల రూపంలో నిల్వచేసి విత్తే ముందు గింజలను వేరు చేయాలి. గింజలను వేరుచేసేటపుడు గింజపై పొర బాగా వుండి రంగు సమానంగా వున్న విత్తనాలను ఎన్నుకోవాలి.
రాష్ట్రంలో వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు.
బ్రాండ్ వనపర్తి ఉత్పత్తులు…