Peanut Cultivation : వేరుశనగ సాగులో విత్తన శుద్ధి, విత్తే పద్ధతి !

ఖరీఫ్‌లో వేరుశనగ పంటను జూలై రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును. ఈ వంటను యానంగిలో అక్టోబరు రెండవ పక్షంలోపు, సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును.

Peanut Cultivation : వేరుశనగ సాగులో విత్తన శుద్ధి, విత్తే పద్ధతి !

Peanut Cultivation

Updated On : October 16, 2023 / 12:06 PM IST

Peanut Cultivation : వేరుశనగ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంట. వేరుశనగ పంట ప్రధానంగా యాసంగిలో అధిక విస్తీర్ణంలో పండిస్తారు. ఈ పంట ‘ సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరియు తుంపర పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుచున్నది. ఈ పంటలో నూనె 48-50 శాతం వరకు ఉంటుంది.

READ ALSO : Hyderabad: ఎన్నికలయ్యాకే ఇళ్లు కొంటామంటున్న బయ్యర్లు.. ఎక్స్‌పర్ట్స్‌ ఏమంటున్నారు?

విత్తన శుద్ధి ;

కిలో విత్తనానికి 1 గ్రా. టెబ్యుకొనజోల్‌ 2 డి.ఎస్‌ లేదా 3 గ్రా. మాంకోజెబ్‌ పొడి మందు పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్‌ తెగులు ఆశించే ప్రాంతాలలో 20 మి.లీ. ఇమిదాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌ ను 7 మి.లీ, నీటిలో కలివి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. వేరువురుగు ఉదృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేదంటే కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు 200 గ్రా. రైజోబియం కల్చరుని పట్టించాలి. వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండము కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోజెర్మా విరిడిని పట్టించి మంచి ఫలితాలు పొందవచ్చు.

READ ALSO : Mango Planting : మామిడి మొక్కలు నాటటానికి అనువైన కాలం, నాటిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విత్తుకునే సమయము :

ఖరీఫ్‌లో వేరుశనగ పంటను జూలై రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును. ఈ వంటను యానంగిలో అక్టోబరు రెండవ పక్షంలోపు, సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును. నేల తయారీ విషయానికివస్తే ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ బంకమన్ను కలిగిన నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయరాదు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసే చదును చేసుకోవాలి.

READ ALSO : Alasanda Cultivation : అలసంద సాగులో పంటకోత.. కోత అనంతరం జాగ్రత్తలు !

విత్తే దూరం :

ఆ వర్షాధారంగా ఖరీఫ్‌లో విత్తేటవ్పుడు 30310 సెం.మీ. దూరంలో మరియు యాసంగిలో నీటి పారుదల క్రింద సాగుచేసేటప్పుడు 22.5-10సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. ఖరీఫ్‌లో ఒక చదరవు మీటరుకి 38 మొక్కలు, యానంగిలో ఒక చదరపు మీటరుకి 44 మొక్కలు ఉండేలా మొక్కల సాంద్రత పాటించాలి. పెద్ద కాయ రకాలు వేసుకున్నపుడు 30౫15 సెం.మీ. దూరము ఉండేలా చేసుకోవటంతోపాటుగా ఒక చదరపు మీటరుకి 28 మొక్కలు
ఉండేలా విత్తుకోవాలి.

READ ALSO : Bathukamma 2023 : పూల సంబురంలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ప్రత్యేకతలు

విత్తే పద్ధతి :

విత్తనాన్ని గొర్రుతో గాని లేక నాగటి చాళ్ళలో గాని లేక ట్రాక్టరుతో నడిచే విత్తే యంత్రముతో గాని విత్తుకోవాలి. విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి. ట్రాక్టరు ద్వారా నడిచే డ్రిల్ ను వాడితే తక్కు వసమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తకోవచ్చు. అంతేకాకుండా ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. ఈ పద్ధతిలో ఎకరం పొలంలో 3గంటలలో విత్తుకోవచ్చు.