Home » Peanut Cultivation :
ఊడలు దిగే దశనుండి కాయలు ఊరే దశవరకు అనగా విత్తిన 45 రోజుల నుండి 90 రోజుల వరకు పంట చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ దశలో నీరు సక్రమంగా తగుమోతాదులో పెట్టుకోవాలి.
తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 5గ్రా ట్రైకోడెర్మా విరిడి అనే మిత్ర శిలీంధ్రం లేదా 2.5గ్రా థైరమ్ లేదా కాప్టాన్ లేదా కార్బండిజమ్ వాడి విత్తనశుద్ధి చేయాలి.