Papaya Varieties : మేలైన బొప్పాయి రకాలు.. సాగు యాజమాన్యం
తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపికచేసుకుని, పంట ప్రారంభం నుండి వైరస్ ను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా వుండాలి.

Papaya Varieties
Papaya Varieties : తెలుగు రాష్ట్రాలలో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయిసాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలను, కొత్తగా సాగుచేయాలనుకునే రైతులకు రకాల ఎంపిక కీలకం. విత్తనం మొదలు కోత కోసే సమయం వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొదవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
READ ALSO : Assam : ఆ గ్రామంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఆ వింత గ్రామం ఎక్కడంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయికి, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం మార్కెట్ లో మంచి ధర పలకడమే కాకుండా,అధిక దిగుబడినిచ్చే రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్ లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా వుండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ.. మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు.
READ ALSO : Robotic Technologies : పంటపొలంలో కలుపు తీస్తున్న రోబో…తగ్గిన కూలీల ఖర్చు
అయితే తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపికచేసుకుని, పంట ప్రారంభం నుండి వైరస్ ను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా వుండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండి, అధిక దిగుబడినిచ్చే రకాలు అర్కాసూర్య, అర్కాప్రభాత్, అర్కా రెడ్ లేడితో పాటు ప్రైవేట్ రకమైన తైవాన్ రెడ్ లేడీ ని రైతులు అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. పంట తొలి దశనుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
READ ALSO : Sunflower Cultivation : ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలు
బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో వినియోగం నానాటికీ పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈపంటలో చీడపీడల వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. సకాలంలో వీటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చు.
READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోను, భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తటం సహజంగా కన్పిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టక పోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది. దీంతో మార్కెట్ లో మంచి ధర రాదు. కాబట్టి సకాలంలో సూక్ష్మదాతు లోపాల నివారణ చర్యలను చేపట్టాలి.