Bodakakara Cultivation : కలిసిరాని బోడకాకర సాగు..వాతావరణ మార్పులే కారణం

నాటిని రెండు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆరు నెలల వరకు దిగుబడి ఉంటుంది. సీజన్‌, డిమాండ్‌ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకూ ఉంటుంది. సీజన్‌ ముగిసే నాటికి రూ.200కుపైగా కూడా పలుకుతుంది.

Bodakakara Cultivation : కలిసిరాని బోడకాకర సాగు..వాతావరణ మార్పులే కారణం

Bodakakara Cultivation

Updated On : October 21, 2023 / 12:27 PM IST

Bodakakara Cultivation : తరచూ ఒకే రకం పంట వేయొద్దు. పంట మార్పిడి చేస్తూ.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నవే సాగు చేస్తే లాభాలు పొందవచ్చు. దీన్నే ఆచరణలో పెట్టారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. సంప్రదాయ పంటల స్థానంలో తీగజాతి కూరగాయలను సాగుచేస్తూ.. లాభాలను గడిస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా  ప్రస్తుతం సాగుచేసిన బోడకాకర తీవ్ర నిరాశకు గురిచేసింది.

READ ALSO : Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

కూరగాయల్లో అగ్రస్థానం బోడకాకరది. దీనినే ఆగాకర కూడా అంటారు. ధరలో దీనికిదే సాటి. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటిది. ఆదరణ, డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో బోడకాకర సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, తాడెపల్లి గూడెం మండలం, చిన్నతాడెపల్లి గూడెం కు చెందిన రైతు పిచ్చికల వెంకటనారాయణ 70 సెంట్లలో శాశ్వత పందిరిపై బోడకాకరను సాగుచేశారు. అయితే విత్తన గడ్డ లోపమో.. వాతావరణ మార్పుల కారణమో గాని.. చెట్లకు అతి తక్కువ కాయలు కాశాయి.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

సాధారణంగా గడ్డ నాటిని రెండు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆరు నెలల వరకు దిగుబడి ఉంటుంది. సీజన్‌, డిమాండ్‌ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకూ ఉంటుంది. సీజన్‌ ముగిసే నాటికి రూ.200కుపైగా కూడా పలుకుతుంది. అధిక మొత్తంలో దిగుబడి వచ్చే బోడకాకరలో పోషకాలు, ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. అందుకే వినియోగదారుల్లో దీనికి ఆదరణ ఎక్కువ. అయితే రైతుకు ఈ పంట కలిసిరాలేదనే చెప్పవచ్చు.