Green Black Gram Cultivation : వేసవి పెసర, మినుము సాగు యాజమాన్యం
Green Black Gram Cultivation : గత కొంత కాలంగా మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుండటంతో.. రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు.

Summer Green Gram & Black Gram Cultivation
Green Black Gram Cultivation : తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే పంట పెసర, మినుము. ఈ పంటల సాగుతో భూసారం పెరగడంతోపాటు, తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తాయి. సాగు మొదటి నుంచే, ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా , యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు.
Read Also : Green Gram Cultivation : వేసవికి అనువైన పెసర రకాలు సాగు యాజమాన్యం
సాగుకు సిద్దమవుతున్న రైతులు :
ప్రస్థుతం వేసవి పంటగా పెసర, మినుమును సాగుచేసే రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. ఏ ఏటికాయేడు తెలుగురాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంత కాలంగా మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుండటంతో.. రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు.
ప్రస్తుతం వేసవి పంటలుగా పెసర, మినుము ఫిబ్రవరి మొదటి వారం నుండి మార్చి మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే పెసర, మినుములో అదిక దిగుబడులను పొందాలంటే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు, ఉమ్మడి మహబూన్ నగర్ జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి.
Read Also : Kisan Agri Show : హైదరాబాద్ హైటెక్స్‌లో కిసాన్ 2024 అగ్రి షో