Dragon Fruit Cultivation : సంప్రదాయ పంటల స్థానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

ఒక్కో మొక్క ధర రూ.50 వెచ్చించి  కొనుగోలు చేశారు.  ఒక్కో స్థంబానికి 4 మొక్కలు చొప్పునా నాటారు. డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండోపంట దిగుబడులు వస్తున్నాయి.

Dragon Fruit Cultivation : సంప్రదాయ పంటల స్థానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

Dragon Fruit Cultivation

Updated On : October 22, 2023 / 4:05 PM IST

Dragon Fruit Cultivation : సంప్రదాయ పంటల సాగులో లాభాలు లేకపోవడమే కాకుండా… నష్టాలు వస్తుండటంతో చాలా మంది ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న, కొత్త కొత్త పంటలను ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తూ.. మంచి ఫలితాలను పొందుతున్నారు.

READ ALSO : Nalli Silks : మోడల్ బొట్టు పెట్టుకోకపోవడంతో వివాదాస్పదమైన యాడ్.. కంపెనీ ఏం చేసిందంటే?

మారిన ఆహార అలవాట్లతో, తెలుగు రాష్ట్రాల్లో  కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నా యి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా,  కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన  డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువుసీమ అయిన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది.

READ ALSO : Carrot Cultivation : క్యారెట్ సాగులో నాణ్యమై దిగుబడి కోసం మెళకువలు

రాప్తాడు మండలం, జి. కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు  గోవిందరెడ్డి. 3 ఏళ్ల క్రితం 3 ఎకరాల్లో మొక్కలు నాటారు. మొత్తం సింమెంట్ స్థంబాలను ఏర్పాటు చేసి, పైన టైర్లను అమర్చాడు. ఒక్కో మొక్క ధర రూ.50 వెచ్చించి  కొనుగోలు చేశారు.  ఒక్కో స్థంబానికి 4 మొక్కలు చొప్పునా నాటారు. డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండోపంట దిగుబడులు వస్తున్నాయి.