Nursery Development : నర్సరీ నిర్వహణతో స్వయం ఉపాధి.. సమయం, డబ్బు ఆదా అవుతుందంటున్న రైతు

ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలా ప్రాంతాల్లో కొందరు రైతులు షేడ్ నెట్ ల క్రింద  ప్రోట్రేలలో నారుపెంచి రైతులకు అందిస్తున్నారు.

Nursery Development : నర్సరీ నిర్వహణతో స్వయం ఉపాధి..  సమయం, డబ్బు ఆదా అవుతుందంటున్న రైతు

Plant Nursery Development

Updated On : November 12, 2023 / 3:52 PM IST

Nursery Development : కూరగాయలు, పండ్లతోటలను సాగుచేసే రైతులు… సంప్రదాయ పద్ధతులకు స్వస్తిపలికారు. తక్కువ సమయంలో నాణ్యమైన దిగుబడులను తీసి, అధిక ఆదాయం గడించాలనే ఉద్దేశంతో నర్సరీ నారుమొక్కల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆధునిక పద్ధతుల్లో నర్సరీలు వెలుగొందుతున్నాయి. నర్సరీల నిర్వహణలో లాభాలు కూడా అదేస్థాయిలో ఉండటంతో  కృష్ణా జిల్లాలో ఓ రైతు నర్సరీ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. తనతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

READ ALSO : ATM Cultivation : ఏటీఎం సాగు.. 70 సెంట్లలో 26 రకాల పంటలు

మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. సంప్రదాయ విధానాలకు స్వస్తీ పలికి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. విత్తు దగ్గరే చిత్తు కాకుండా నర్సరీల్లో పెంచిన నారును నమ్ముకుంటున్నారు. సాధారణంగా రైతాంగం సమతల మళ్ళలో నారును పెంచుతూ వుంటారు. ఈ విధానంలో మురుగునీటి సౌకర్యం లేకపోవటం వల్ల నారుకుళ్ళు తెగులు బెడద ఎక్కువగా వుండి, సకాలంలో నారు అందక, అదును తప్పటం..  మళ్ళీమళ్ళీ నారును పోయాల్సి రావటం వంటి పలు కారణాల వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగేవి. పైగా అదును తప్పటం వల్ల దిగుబడులు తగ్గి, రాబడి ఏమంత ఆశాజనంగా వుండేది కాదు.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

ఎత్తుమళ్ళలో నారుపెంపక విధానం  ఈ సమస్యలను కొంత వరకు అధిగమించినా, చీడపీడల ఉధృతి ఎక్కువగా వుండటంతో… ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలా ప్రాంతాల్లో కొందరు రైతులు షేడ్ నెట్ ల క్రింద  ప్రోట్రేలలో నారుపెంచి రైతులకు అందిస్తున్నారు. ఈకోవలోనే కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, బొమ్ములూరు గ్రామానికి చెందిన రైతు అట్లూరి సుబ్రమణ్యం.. రెండేళ్ల క్రితం 25 లక్షల పెట్టుబడితో 2 ఎకరాల్ల షేడ్ నెట్ నర్సరీ ని ఏర్పాటు చేశారు. ప్రోట్రేలలో నాణ్యమైన కూరగాయలు, పండ్ల మొక్కల నారు పెంచి రైతులకు ఇస్తున్నారు.

READ ALSO : Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

మట్టికి బదులుగా కొబ్బరిపొట్టు, బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు ట్రైకోడెర్మా జీవ శిలీంద్రం కలిపి వృద్దిచేస్తున్నారు రైతు సుబ్రమణ్యం. ఈ ఎరువు మిశ్రమాన్ని 90శాతం వరకు ట్రేలలో నింపి, ఆతర్వాత ఒక్కో గుంతలో ఒక్కొక్క విత్తనాన్ని పెట్టి, దానిపై పలుచగా మరొకసారి ఈమిశ్రమాన్ని పైపొరగా వేస్తున్నారు. ఇలా విత్తనాన్ని పెట్టిన ట్రేలను ఒకదానిపై మరొకటి అమర్చి… షేడ్ నెట్ ల క్రింద బెడ్లపై అమర్చుతున్నారు. నెలరోజుల పాటు సమయానుకూలంగా నీటితడులు, సూక్ష్మపోషకాలను అందించి రైతులకు నారును అందిస్తున్నారు.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది.  షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధానపొలంలో నాటినపుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం వుంటుంది కనుకు దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.