Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్‌ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు.

Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

Rainy Season Crops

Vegetable Crops : తొలకరి పలకరించింది. రైతులంతా పొలం పనుల్లోబిజీబిజీగా ఉన్నారు. సాధారణంగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు ఇప్పటి నుండే నారు పెంపకంతో సన్నద్ధమవుతుంటారు. ముఖ్యంగా కూరగాయలు సాగుచేసే రైతులు ప్రాంతానికి తగిన రకాన్ని ఎంచుకోవడంతోపాటు విత్తనమోతాదు, విత్తనశుద్ధి, నారు పెంపకం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఖరీఫ్ కు అనువైన కూరగాయ పంటలు, మేలైన రకాల వివరాలను తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త డా. కోట శివకృష్ణ

READ ALSO : High Profit Farming : 10 ఎకరాల్లో వరితో పాటు పసుపు, కూరగాయల సాగు.. పెట్టుబడిలేని సాగుతో లాభాలు పొందుతున్న రైతు

ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్‌, రబీ, వేసవి కాలంలో సాగు చేస్తారు.

READ ALSO : Vegetable Farming : 2 ఎకరాల్లో కూరగాయల సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం

అయితే రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్‌ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది.

READ ALSO : Green Gram Cultivation : ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

కావున ఖరీఫ్‌ కూరగాయల సాగులో రైతు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పంట నష్టం నుంచి బయటపడటంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరకు కూరగాయలను అందించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త డా. కోట శివకృష్ణ.

READ ALSO : Cultivation Of Kharif Crops : ఖరీఫ్ అపరాల సాగులో యాజమాన్యం

వంగ , బెండ, మూడు కాలాల్లో పొలాల్లో పలు దశల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు తీగజాతి పంటలు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ.. మార్కెట్ కు అనువైన రకాలను ఎంచుకొని సాగుచేస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా వర్షాకాలంలో కూరగాతోటల్లో అధికంగా కలపు ఉంటుంది. అసలే కూలీలు అధికంగా అవసరమయ్యే ఈ కూరగాల తోటల్లో సమగ్ర యాజమాన్యం చేపట్టినట్లైతే అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది.