Home » horticulture
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, తదితర వివరాలను క్షణాల్లో రైతులకు తెలియజేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
అధిక తేమ కలిగిన వాతావరణం దీని సాగుకు అనుకూలంకాదు. నిరు నిల్వ ఉండని నేలలు అనువుగా ఉంటాయి. జీడి సాగులో తెగుళ్లు వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంది. రైతులు మంచి దిగుబడి కోసం మంచి రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఉల్లి పంట వెయ్యడానికి ముందునేలను దమ్ము చేసుకోవాలి. ఆఖరిగా దుక్కి అయిపోయాక భూమిని చిన్న, చిన్న మడులుగా విభజించాలి. నీరు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేయాలి.
నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి లేదా ప్రొపార్‌గైట్ 2 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది.
నీరు నిలువని సారవంతమైన ఎర్రనేలలు, మెరకనేలలు, అధిక సేంద్రియ పదార్థాలు గల ఇసుక నేలలు అనుకూలం. చౌడు,క్షారత్వం, నీరు నిలువ ఉండే భూములు పనికిరావు. ఉదజని నూచిక 5.8-5.5 ఉన్న నేలలు అనువైనవి.
కలుపు తీసిన ప్రతి సారి మొక్కచుట్టూ మట్టిని ఎగదోసి,పెరిగే గడ్డలకు ఎండ తగలకుండా చూడాలి. ఎండ తగిలితే గడ్డలు ఆకుపచ్చగా మారి తినడానికి వీలుకావు. నాటిన 75 రోజులకు మాలిక్ హైడ్రాజైడ్ (2.5 గ్రా/లీ.) పిచికారి చేస్తే నిల్వలో గడ్డలు మొలకెత్తడం తగ్గుతుంది.
వాణిజ్యపరంగా సాగుచేసే పూలలో బంతి ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. బంతిపూల పంటకాలం 120రోజులు కాగా, నాటిన 55 నుండి 60 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది.
టమాట సాగులో నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం . భూమిలో తేమను బట్టి నీటితడులు అందించాలి. ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుంతుంది. కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అంతే కాదు టమాటలో కలుపు యాజమాన్యం కూడా కీలకం.
మునగ మొక్క తోటను నరికిన తర్వాత, ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్శి లేదా మోడెం పంట అంటారు. జూన్ , జులై నెలల్లో మునగను నరికిన తర్వాత రైతులు కార్శి తోటల నిర్వహణపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.