Tomato Cultivation : టమాటలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ
టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది.

Tomato Cultivation
Tomato Cultivation : మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉద్యాన పంటల్లో చీడపీడల ఉధృతి అధికమవుతోంది. వీటిని అరికట్టేందుకు రైతులు అధిక ఖర్చు చేస్తున్నారు. చీడపీడల ఉధృతితె పంట పెరుగుదల క్షీణించి, దిగుబడి గణనీయంగా తగ్గిపోమే ప్రమాదముంది.
READ ALSO : ATM Cultivation : ఏటీఎం సాగు.. 70 సెంట్లలో 26 రకాల పంటలు
ముఖ్యంగా టమాట తోటల్లో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉధృతి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెగులు లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్.
READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు
టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది. ఈ తెగులు తెగులు ఆశించినట్లైతే కాయలు పిందె దశలోనే కుళ్లిపోవటం, ఆకులు రాలిపోవటంతో పంట పెరుగుదల క్షీణిస్తుంది . ఉభయ తెగులు రాష్ట్రాల్లో చాలాప్రాంతాల్లో టమాట తోటల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
చాళ్ల మధ్య కలుపును సకాలంలో అరికట్టినప్పటికీ తెగులును సకాలంలో గుర్తించకపోవటం వల్ల, తోటలో దీని ఉధృతి పెరిగిపోతుంది. దీంతో దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు ఈ బాక్టీరియా ఆకుమచ్చ తెగులుగా నివారించేందుకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్.