Integrated Agriculture : సమీకృత వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి.. రైతుకు భరోసానిస్తున్న పలు పంటలు, అనుబంధ రంగాలు

సమగ్ర వ్యవసాయంలో ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు , పశువులకు , మేకలకు , కోళ్ళకు మేత సమృద్ధిగా లభిస్తుంది. అంతే కాకుండా అనుబంధరంగాలనుండి అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ నమూనను చూసిన రైతులు తమ వ్యవసాయ భూముల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు.

Integrated Agriculture : సమీకృత వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి.. రైతుకు భరోసానిస్తున్న పలు పంటలు, అనుబంధ రంగాలు

IntegratedAgriculture

Integrated Agriculture : అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే,  అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. సంప్రదాయ పంటలపైనే ఆదారపడకుండా ఏకకాలంలో వివిధ రకాల పంటలతోపాటు అనుబంధ రంగాలను పెంచితే అదనపు ఆదాయన్ని పొందవచ్చు. ఈ దిశగ రైతులను ప్రోత్సహిస్తోంది మంచిర్యాల జిల్లా, బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రం. ఇందుకోసం సమీకృత వ్యవసాయ విధానాన్ని ఒక మోడల్ ఫాం రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

READ ALSO : Mixed Farming : రైతుకు భరోసానిస్తున్న మిశ్రమ వ్యవసాయం.. పలు పంటల సాగు విధానంతో స్థిరమైన ఆర్థిక వృద్ధి

ఒకప్పుడు  రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం చేపట్టి ఖచ్చితమూన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతే కాకుండా ఒకే పంటను సాగుచేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు.

వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అత్యంత అవసంరం. దీనినే దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల జిల్లా, బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక మోడల్ ఫాంగా సమగ్ర వ్వవసాయ విధానాన్ని చేపట్టి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

మోడల్ ఫాం, శాశ్వత పందిర్లు.. పాలీమల్చింగ్ విధానంలో ఎత్తైన బెడ్ లు . ఒక వరుసలో తీగజాతి పంటలను , తరువాత ఆ పందిరికింద రెండు వరుసలు కూరగాయ పంటలు, దాంతో పాటు ఆకు కూరల సాగు. ఆ పక్కనే పుచ్చసాగు. మరో పక్క నువ్వు సాగు. నీటిని వృదా చేయకుండా డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు.

చీడపీడలను నివారించేందుకు లింగాకర్షక బుట్టల ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు పశువులు, కోళ్లు, మరో వైపు ఫాం పాండ్ లో చేపల పెంపకం.. ఇలా సమీకృత సాగును తీర్చిదిద్దారు బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. మారుతున్న కాలానుగుణంగా   వ్యవసాయం  అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపుగా వ్యవసాయం చేపట్టి, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

READ ALSO : Weekend farming : వీకెండ్ వ్యవసాయంపై సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఫోకస్..ఫాం హౌసుల్లో కడక్‌ నాథ్‌ కోళ్ల పెంపకం..

సమగ్ర వ్యవసాయంలో ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు , పశువులకు , మేకలకు , కోళ్ళకు మేత సమృద్ధిగా లభిస్తుంది. అంతే కాకుండా అనుబంధరంగాలనుండి అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ నమూనను చూసిన రైతులు తమ వ్యవసాయ భూముల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు.

మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్ధాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసాల కొరత ఉండదు. పశుపోషణ ఆరోగ్యవంతంగా ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. భూసార, పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత లభిస్తుంది.