Home » INTEGRATED FARMING SYSTEM
నిర్మల్ జిల్లా, దిలావార్పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇదే మార్గంలో సాగుతున్నారు. లాభసాటి వ్యవసాయ విధానాలతో తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.
సమగ్ర వ్యవసాయంలో ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు , పశువులకు , మేకలకు , కోళ్ళకు మేత సమృద్ధిగా లభిస్తుంది. అంతే కాకుండా అనుబంధరంగాలనుండి అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ నమూనను చూసిన రైతులు తమ వ్యవసాయ భూముల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు.