Top 5 Camera Phones : తగ్గేదేలే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కన్నా తోపు ఫీచర్లతో టాప్ 5 కెమెరా ఫోన్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!

Top 5 Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనే బదులు ఈ 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లలో ఏదో ఒకటి కొనేసుకోండి.. తక్కువ ధరలో అదే ఫీచర్లను పొందవచ్చు..

Top 5 Camera Phones : తగ్గేదేలే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కన్నా తోపు ఫీచర్లతో టాప్ 5 కెమెరా ఫోన్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!

Top 5 Camera Phones

Updated On : November 26, 2025 / 7:47 PM IST

Top 5 Camera Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? లేటెస్ట్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనే ముందు ఒక క్షణం ఆగండి.. ఐఫోన్ అంటే అందరికి క్రేజే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ అద్భుతమైన కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. కానీ, ఇదే తరహా కెమెరా ఫీచర్లను ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా అందిస్తున్నాయి.

అనేక ఆండ్రాయిడ్ బ్రాండ్లు తక్కువ (Top 5 Camera Phones) ధరకే ఇలాంటి మెరుగైన కెమెరా క్వాలిటీని అందిస్తున్నాయి. మీరు కూడా ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ కొనాలని చూస్తుంటే ముందుగా ఈ 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లపై ఓసారి లుక్కేయండి.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

​శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,05,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 200MP + 10MP + 50MP + 50MP లెన్స్‌లతో సహా క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 5000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో 50MP వెడల్పు, 48MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. 4870mAh బ్యాటరీతో గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, 3300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇచ్చే 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది.

Read Also : Mahindra XUV300 MX2 : ఇది కదా ఆఫర్ అంటే.. మహీంద్రా MX2 SUVని జస్ట్ రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు.. ప్రతి నెలా EMI ఎంతంటే?

షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) :

షావోమీ 15 అల్ట్రా క్వాడ్-కెమెరా సెటప్‌లో 50MP + 50MP + 200MP + 50MP సెన్సార్లు, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం 68B రంగులను అందించే 6.73-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

వివో X200 ప్రో (రూ. 94,999) :
వివో X200 ప్రో ఫోన్ 50MP, 200MP, 50MP సెన్సార్లతో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఇంకా, 1B కలర్‌లతో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 1,09,999) :
లేటెస్ట్ ఒప్పో ఫైండ్ X9 ప్రోలో 50MP + 200MP + 50MP ప్రైమరీ కెమెరా సెటప్, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా, డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 7500mAh బ్యాటరీని కలిగి ఉంది.