రైతన్నకు సహాయం: వ్యవసాయం చేస్తున్న బాతులు

  • Published By: nagamani ,Published On : October 7, 2020 / 12:08 PM IST
రైతన్నకు సహాయం: వ్యవసాయం చేస్తున్న బాతులు

assam duck farming : వ్యవసాయంలో రైతన్నలకు సహాయంగా ఎద్దులు పనిచేస్తాయనే విషయం తెలిసిందే. టెక్నలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇంకా మెట్ట ప్రాంతాలలో ఎద్దులతో పొలం దున్ని వ్యవసాయం చేస్తున్నారురైతులు. కానీ అస్సాంలో మాత్రం రైతన్నలకు చేదోడు వాదోడుగా బాతులు సహాయపడుతున్నాయి. బాతులు వ్యవసాయం చేయటమేంటీ? రైతులు అవిఎలా సహాయ పడుతున్నాయనే విషయం తెలుసుకుందాం..


అస్సాంలో రైతులు పొలాల్లో నాటులువేసిన తరువాత పంట మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతుంటాయి. ఆ కలుపు మొక్కలను తీయటానికి రైతులు బాతుల్ని ఉపయోగిస్తున్నారు. రైతులు పొలాల్లో నాటులు వేసిన తరువాతు పెరిగే కలుపు మొక్కలను తొలగించటానికి తాము పెంచుకుంటున్న బాతులను పొలాల్లోకి వదులుతారు. అవి పొలంలోకి వెళ్లి తమ కాళ్లతో భూమిలోని కలుపు మొక్కల్ని తినేస్తాయి. ఈ రకంగా బాతులు రైతన్నలకు నేస్తాలుగా మారాయి. ఖర్చును తగ్గిస్తున్నాయి. బాతులవల్ల అస్సాం రైతులకు ఖర్చు తగ్గింది.


కాగా దేశంలో ఎక్కువగా వరి పండించే రాష్ట్రాల్లో అస్సాం రాష్ట్రం ఒకటి. అస్సాం రైతులు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం చేస్తారు. ఏడాదికి ఒక పంట మాత్రమే పండిస్తారు. ఏప్రిల్‌లో వరిపంట నార్లు వేస్తారు. అవి అక్టోబర్, నవంబర్‌లో పంటకొస్తాయి. వాటిని కోస్తారు. వ్యవసాయంతో పాటు మేకలకు, కోళ్లకు, బాతుల్ని పెంచుకుంటారు. వాటికి ప్రత్యేకంగా గుడిసెలు నిర్మిస్తారు.


అంతేకాదు అస్సాం రైతులు ఆవుల్ని పెంచుకుంటారు. ఆవులను పూజించే సంసృతి కొనసాగిస్తున్నారు. వ్యవసాయం చేసే సమయంలో నేలతల్లికి పూజ చేస్తారు. విత్తనాలను కూడా పూజించే పొలంలో జల్లుతారు. కాగా..ప్రాచీన కాలం నుంచి వస్తున్న దేశవాళీ వరి విత్తనాలును మాత్రమే వాడుతున్నారు.


విత్తనాల కోసం ప్రత్యేకించి నారుమడులల్లో పండిస్తారు. ఆపంట చేతికొచ్చిన తరువాత ఆ ధాన్యాన్ని ధాన్యభాండాగారాన్ని (గాదెలు) నిర్మించుకుని విత్తనాలను కాపాడుకుంటున్నారు. ఈనాటికీ కృష్ణ బియ్యం( బ్లాక్ రైస్ ), రెడ్ రైస్, బ్రౌన్ రైస్ పండిస్తున్నారు. ఈ వరి పంట ఆరు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.పంటలకు పురుగులు పట్టకుండా ఎటువంటి క్రిమిసంహారక (పెస్టిసైడ్స్) మందులు వాడరు. పొలం పొడుగునా తులసి మొక్కలు పెంచుతారు. ఈ తులసి మొక్కలు 7 అడుగుల నుంచి 9 అడుగుల వరకూ పెరుగుతాయి. ఆ తులసి ఆకుల నుంచి వచ్చే గాలి పంటకు చీడపీడలు రాకుండా కాపాడుతుంది. కనీసం యూరియా వంటి ఎరువులు కూడా వాడరు. అంటే ప్రభుత్వం ఇచ్చే యూరియా, పురుగుల మందులు కూడా తీసుకోరు..వాడరు. పంట ఏపుగా ఎదగటానికి ఎరువుగా పొలంలో ఆవుపేడను వాడుతున్నారు.


అస్సాం రైతులు కూరగాయలు కూడా ఎక్కువగానే పండిస్తున్నారు. కూరగాయాల్లో అరటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. రైతులు పంట కోసం బైటవి కొనరు..వాడరు. తమకున్న భూమిని సద్వినియోగం చేసుకుంటారు. పెరట్లలో, ఖాళీ స్థలాల్లో మసాలాలకు పనికొచ్చే మొక్కలు పండిస్తారు. యాలకులు..లవంగాలు వంటివి పండిస్తారు.