అధికారుల వినూత్న ప్రయోగం.. రైతులు ఫుల్ ఖుషీ.. క్షణాల్లో చేరుతున్న సమాచారం.. ఆ జిల్లాలో ప్రతి మండలానికి ఓ వాట్సాప్ గ్రూప్..

వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, తదితర వివరాలను క్షణాల్లో రైతులకు తెలియజేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.

అధికారుల వినూత్న ప్రయోగం.. రైతులు ఫుల్ ఖుషీ.. క్షణాల్లో చేరుతున్న సమాచారం.. ఆ జిల్లాలో ప్రతి మండలానికి ఓ వాట్సాప్ గ్రూప్..

Agricultural officers whatsapp group

Updated On : February 3, 2025 / 2:38 PM IST

Palamuru District: రైతులు సాగుచేసే పంటల్లో తెగుళ్లు, చీడపీడల నివారణకు, పంటల ఎదుగుదలకు వాడాల్సిన మందులు.. పంటల సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి సరియైన అవగాహన లేక ఇబ్బందులు పడుతుంటారు. తద్వారా పంట దిగుబడి తగ్గి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్న పరిస్థితి. ఇలాంటి వారికి మేమున్నామని అధికారులు భరోసా కల్పిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వ్వవసాయ అధికారులు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన సమాచారాన్ని అందజేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి.. తెగుళ్లు, ఇతర చీడపీడలు ఆశిస్తే వాటి నుంచి ఎలా పంటలను కాపాడుకోవాలనే వివరాలను వాట్సాప్ ద్వారా క్షణాల్లో రైతులకు అందిస్తున్నారు.

Also Read: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’కు వారంతా అనర్హులే..! భారీగా దరఖాస్తులు రిజక్ట్.. మళ్లీ కొత్తగా అప్లయ్ చేసుకోవాలా?

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతీ మండలానికి ఒక వాట్సాప్ గ్రూపును వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల్లో వ్యవసాయంలో యాక్టివ్ గా ఉన్న రైతులు, యువ రైతులను దాదాపు 250 మంది నుంచి 300 మంది వరకు జాయిన్ చేశారు. తద్వారా సదరు రైతులకు పంటల సాగులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తున్నారు. రైతు సాగు చేసిన పంటకు చీడ పీడలు, తెగుళ్లు ఆశించినప్పుడు వాటి నివారణకు ఎలాంటి మందులు వాడాలి.. ఎంత మోతాదులో పిచికారీ చేయాలనే విషయాలను రైతులకు తెలియజేస్తున్నారు. ముందుగా రైతులు వారు సాగుచేసిన పంటలో తెగుళ్లు వస్తే అందుకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు. దీంతో తెగులు నివారణకు ఏఏ మందులు పిచికారి చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను రైతులకు వాట్సాప్ ద్వారానే వ్యవసాయాధికారులు వేగంగా సమాచారం అందజేస్తున్నారు.

Also Read: Ponguleti Srinivas Reddy : పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..

వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన గ్రూపుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేస్తున్న పథకాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. వాణిజ్య పంటలతోపాటు, హార్టికల్చర్ పంటలకు సంబంధించిన వివరాలను గ్రూపుల్లో పోస్టులు చేస్తున్నారు. చీడపీడలు, తెగుళ్లు తదితర వాటిపై అగ్రికల్చర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అందించే సూచనలు, సలహాలను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తూ రైతుల్లో అవగాహన పెంచుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా మామిడి తోటల రైతులతోకలిపి హార్టికల్చర్ అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మామిడి రైతులకు పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. పూత రాలకుండా, పిందెకు పురుగు పట్టకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి వాట్సాప్ గ్రూపులో వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు వివరిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు.