Ponguleti Srinivas Reddy : పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.

Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy : పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు. నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించొద్దని హితవు పలికారు మంత్రి పొంగులేటి.
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించిన సందర్భంగా మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : వైసీపీ నుంచి వలసలు.. నాగబాబు సంచలనం.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్..
పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం..
పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుని పరామర్శల కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వైరాలో జరిగిన ఓ చిన్న ఫంక్షన్ లో ఆయన కార్యకర్తలతో ముచ్చటించారు. వారిని కొంత అలర్ట్ చేశారు.
పార్టీ కార్యకర్తలను అలర్ట్ చేసిన మంత్రి పొంగులేటి..
ఈ నెల 15వ తేదీ లోపే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోందని మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన.. పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే కులగణన సర్వే పూర్తై దానికి సంబంధించిన నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు సంబంధించి ఎంత ఓటింగ్ శాతం ఉంది అనే దానిపై స్పష్టమైన నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో 4వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం జరగబోతోంది.
Also Read : వసుంధరకి ఎమ్మెల్యే టికెట్.. బాబు, బాలయ్య మధ్య చర్చలు.. ఫన్నీ ఫన్నీగా..
పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి…
కులగణన నివేదికను అసెంబ్లీలో ఆమోదింపజేశాక పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని, పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించొద్దని హెచ్చరించారు మంత్రి పొంగులేటి.