Cm Chandrababu : వసుంధరకి ఎమ్మెల్యే టికెట్.. బాబు, బాలయ్య మధ్య చర్చలు.. ఫన్నీ ఫన్నీగా..

బాలయ్య గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆయన టాలెంట్ ను ప్రశంసించారు.

Cm Chandrababu : వసుంధరకి ఎమ్మెల్యే టికెట్.. బాబు, బాలయ్య మధ్య చర్చలు.. ఫన్నీ ఫన్నీగా..

Updated On : February 2, 2025 / 6:09 PM IST

Cm Chandrababu : నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఫ్యామిలీ పార్టీలో నందమూరి, నారా కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో బాలయ్యను ఆయన ముగ్గురు సోదరీమణులు సరదాగా ప్రశ్నలు అడిగారు. బాలయ్య కూడా అంతే సరదాగా సమాధానాలు ఇచ్చారు.

చంద్రబాబు బాలకృష్ణ మధ్య కూడా సరదా సంభాషణ..
ఇక, చంద్రబాబు బాలకృష్ణ మధ్య కూడా సరదా సంభాషణ నడిచింది. ఇద్దరూ ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వసుంధరకు ఎమ్మెల్యే టికెట్ అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఫ్యామిలీ పార్టీలో నవ్వులు పూయించాయి.

బాలయ్యపై చంద్రబాబు ప్రశంసల వర్షం..
బాలయ్య గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఫన్నీ కామెంట్స్ చేశారు. బాలయ్య గురించి సరదాగా మాట్లాడారు. ఆయన టాలెంట్ ను ప్రశంసించారు. ఒకవైపు యాక్టర్ గా మరోవైపు గొప్ప మానవతావాదిగా ఇంకోవైపు ఎమ్మెల్యేగా బాలకృష్ణ అద్భుతంగా రాణిస్తున్నారని కితాబిచ్చారు చంద్రబాబు. ఇదే సమయంలో వసుంధరకు ఎమ్మెల్యే టికెట్ అంటూ ఫన్నీగా మాట్లాడారు చంద్రబాబు.

Also Read : మహేష్ బాబు సపోర్ట్ చెయ్యలేదా..? ఆయన సూపర్ స్టార్ అయినంత మాత్రాన.. నమ్రత చెల్లి కామెంట్స్..

రోజురోజుకు యంగ్ అవుతున్నారు, గ్లామర్ పెరుగుతోంది..
’50 సంవత్సరాలు ఎవర్ గ్రీన్ హీరోగా వెలుగొందుతున్నారు. దర్శకులను అందరినీ అభినందిస్తున్నా. ఆయన ఎవ్రీ డే టానిక్ ఇస్తూనే ఉన్నారు. కిక్ ఇస్తూనే ఉన్నారు. ఆయన కూడా అందిపుచ్చుకుంటున్నారు. సినిమా సినిమాకు యంగ్ అవుతున్నారు. చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు.

అదే సమయంలో ఇంకో పక్క రెండో కోణంలో ఆయనను చూస్తే గొప్ప మానవతావాది. హాస్పిటల్ మాకు గుర్తు. ప్రజలకు సేవ చేసేందుకు క్యాన్సర్ ఆసుపత్రి పెడితే బాగుంటుందన్నారు. అక్కడి నుంచి ప్రారంభించారు. హాస్పిటల్ ను బాలయ్య టేకోవర్ చేసిన తర్వాత బెస్ట్ లీడింగ్ క్యాన్సర్ ఆసుపత్రిగా తయారైందంటే నేను గర్వపడుతున్నా. ఆయన డెడికేషన్ ను మెచ్చుకోవాల్సిందే. సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి మేనేజ్ మెంట్ కమిటీ పెట్టుకుని మళ్లీ ఈ పార్టీకి వచ్చారు.

Also Read : ‘మ్యాన్షన్ హౌజ్’కి నీకు సంబంధం ఏంటి? బాలయ్యకు నారా భువనేశ్వరి ప్రశ్న.. బాలయ్య ఏం చెప్పాడో తెలుసా?

ఈసారి ఎమ్మెల్యే టికెట్ వసుంధరకు ఇవ్వమని అంటుంటారు..
ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు కాదు ఆయన ఉన్నంతవరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటారు. కానీ, అప్పుడప్పుడు అంటా ఉంటారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ వసుంధరకు ఇవ్వమని అంటుంటారు. అది కావాలని చెప్తారో లేకపోతే ఆవిడను మెప్పించడానికి చెబుతారో తెలియదు కానీ అప్పుడప్పుడు అంటా ఉంటారు” అని చంద్రబాబు అనగానే ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరబూసాయి.