Shilpa Shirodkar : మహేష్ బాబు సపోర్ట్ చెయ్యలేదా..? ఆయన సూపర్ స్టార్ అయినంత మాత్రాన.. నమ్రత చెల్లి కామెంట్స్..

మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ చెల్లి, నటి శిల్ప శిరోద్కర్ ఇటీవల హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది.

Shilpa Shirodkar : మహేష్ బాబు సపోర్ట్ చెయ్యలేదా..? ఆయన సూపర్ స్టార్ అయినంత మాత్రాన.. నమ్రత చెల్లి కామెంట్స్..

Shilpa Shirodkar Comments on Mahesh Babu and Namrata Shirodkar about Support in Bigg Boss

Updated On : February 2, 2025 / 2:07 PM IST

Shilpa Shirodkar : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న తెలిసిందే. మహేష్ బాబు సోషల్ మీడియాలో ఏదైనా సినిమాలు బాగుంటే ఆ టీమ్ కి కంగ్రాట్స్, ప్రమోషనల్ కంటెంట్ తప్ప చాలా రేర్ గా పోస్టులు చేస్తూ ఉంటారు. మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ చెల్లి, నటి శిల్ప శిరోద్కర్ బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల శిల్ప శిరోద్కర్ హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది.

Also Read : Balakrishna : ‘మ్యాన్షన్ హౌజ్’కి నీకు సంబంధం ఏంటి? బాలయ్యకు నారా భువనేశ్వరి ప్రశ్న.. బాలయ్య ఏం చెప్పాడో తెలుసా?

శిల్ప శిరోద్కర్ 2010 తర్వాత సినిమాలకు దూరమయింది. అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కనిపిస్తుంది. ఇటీవలే మళ్ళీ యాక్టివ్ అయి సినిమాలు, టీవీ షోలలో మరింత యాక్టివ్ గా పాల్గొంటుంది. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 18 లో పాల్గొన్న శిల్ప శిరోద్కర్ 102 రోజుల తర్వాత ఎలిమినేట్ అయింది. షోలో ఉన్నప్పుడు హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా శిల్పని ఉద్దేశించి మహేష్ ని పొగుడుతూ మాట్లాడాడు. అయితే బాలీవుడ్ మీడియాలో మహేష్ బాబు శిల్ప శిరోద్కర్ కి సపోర్ట్ చేయలేదు బిగ్ బాస్ విషయంలో అని వార్తలు వచ్చాయి. నమ్రత, సితార శిల్ప శిరోద్కర్ కి ఓట్లు వేయండి అంటూ తమ సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. మహేష్ బాబు మాత్రం శిల్ప శిరోద్కర్ బిగ్ బాస్ గురించి అసలు పట్టించుకొలేదు.

Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్ లైనప్ అదిరిందిగా.. బ్యాక్ టు బ్యాక్ హిట్ డైరెక్టర్స్ తో బాస్..

తాజాగా శిల్ప శిరోద్కర్ కి ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురవ్వగా.. సోషల్ మీడియాలో మన గురించి పోస్టులు పెడితేనే మంచి సంబంధాలు ఉన్నట్టు, పెట్టకపోతే ఏదో విభేదాలు ఉన్నట్టు భావించడం కామన్ అయిపోయింది. మనుషుల మధ్య అనుబంధాలను సోషల్ మీడియా వేదికగా అంచనా వేయకూడదు. ఆన్లైన్ వేదికగా ప్రేమలను, అభిమానాన్ని చూపించే వ్యక్తులం కాదు మేము. నన్ను నేను నిరూపించుకోవడానికి, నా కోసం ఆ షోకి వెళ్ళాను. అంతే కానీ నమ్రత చెల్లిగానో, మహేష్ మరదలిగానో కాదు. మహేష్ బాబు సూపర్ స్టార్ అయినంత మాత్రాన నాకు సపోర్ట్ చేయాలని, నా కెరీర్ లో భాగం అవ్వాలని రూల్ లేదు. మహేష్, నమ్రత ప్రైవేట్ గా ఉండే వ్యక్తులు. వాళ్ళు అందరితో త్వరగా కలవరు. దాన్ని మిగిలినవాళ్లు పొగరు అనుకుంటారు కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. మహేష్ అవసరమైన సమయంలో అండగా నిలబడతాడు అని తెలిపింది. దీంతో శిల్పా కామెంట్స్ వైరల్ గా మారాయి.