Megastar Chiranjeevi : మెగాస్టార్ లైనప్ అదిరిందిగా.. బ్యాక్ టు బ్యాక్ హిట్ డైరెక్టర్స్ తో బాస్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేస్తున్నారు చిరంజీవి.

Megastar Chiranjeevi Back to Back Movies with Hit Directors
Megastar Chiranjeevi : మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదు. మొన్నమొన్నటి వరకూ అసలు విశ్వంభర తర్వాత ఏం సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి వెంటవెంటనే రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఈ రెండు సినిమాలే ఎప్పుడు చేస్తారా అని ఆడియన్స్ ఆలోచిస్తుంటే మూడో సినిమాని కూడా లైనప్ చేసేశారు.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన తరవాత లాస్ట్ ఇయర్ వరకూ స్లో అండ్ స్టడీ అన్నట్టుగా తొందరపడకుండా నెమ్మదిగానే సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారింది. స్పీడ్ మారింది. అందుకే వరసగా నచ్చిన సినిమాలకు ఓకే చెబుతూ డైరెక్టర్లకి డేట్స్ ఇచ్చే పనిలో ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం బింబిసార లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం.
Also Read : Pavani Karanam : పుష్పలో బన్నీని చిన్నాయన అని పిలిచే అమ్మాయి.. పావని.. సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ గా..
ఇటీవల చిరంజీవి దసరా సినిమాతో హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని ప్రొడ్యూసర్ గా కమర్షియల్ యాక్షన్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ సినిమాతో పాటు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సాలిడ్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నారు చిరంజీవి. అనిల్ రావిపూడి ఇప్పటికే పలుమార్లు చిరంజీవితో సినిమా చేస్తున్నాను అని తెలిపాడు.
ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకెళ్లకుండానే మరో సినిమా తెరమీదకొచ్చింది. మెగాస్టార్ లేటెస్ట్ గా రెండేళ్ల క్రితం తనకి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది. 2023లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి తన మాస్ పవర్ చూపించారు. ఆ సినిమాతో కొన్నాళ్లుగా మిస్ అయిన చిరంజీవి మాస్ యాంగిల్ చూసి తెగ మురిసిపోయారు ఫాన్స్. ఆ సినిమా పెద్ద హిట్ అయి 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
Also Read : Divi : మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేసాను.. నాగార్జున ఉంటే బిగ్‌బాస్ లో ఉండేదాన్ని.. కానీ సమంత రావడంతో..
ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరోసారి సినిమా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. బాబీ డైరెక్షన్లో రెండోసారి మెగాస్టార్ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం. మాస్ పల్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ పల్స్ తెలుసుకున్న బాబీ అదే స్టైల్లో మరో హిలేరియస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నారని సమాచారం. ఇలా వరుసపెట్టి హిట్ డైరెక్టర్స్ తో సినిమాలు ఒకే చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.