Divi : మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేసాను.. నాగార్జున ఉంటే బిగ్‌బాస్ లో ఉండేదాన్ని.. కానీ సమంత రావడంతో..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అప్పుడు ఏం జరిగింది అని తెలిపింది.

Divi : మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేసాను.. నాగార్జున ఉంటే బిగ్‌బాస్ లో ఉండేదాన్ని.. కానీ సమంత రావడంతో..

Divi Comments on Bigg Boss Regarding her Elimination

Updated On : February 2, 2025 / 11:42 AM IST

Divi : ప్రస్తుతం నటి దివి వరుసగా సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి తో గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత దివి సోషల్ మీడియాలో మరింత వైరల్ అయి సినిమా ఛాన్సులు తెచ్చుకుంది. పలు చిన్న సినిమాలలో, సిరీస్ లలో హీరోయిన్ గా నటిస్తూనే పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. ఇటీవల పుష్ప 2, డాకు మహారాజ్ సినిమాలతో పలకరించింది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అప్పుడు ఏం జరిగింది అని తెలిపింది. దివి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. కరోనా సమయంలో ఈ సీజన్ జరిగింది.

Also Read : Gagana Geethika : ‘డాకు మహారాజ్’ కథని మలుపు తిప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలుసా? ఆమె తండ్రి కూడా నటుడే..

దివి బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ కు మోడల్ లాగే నన్ను సెలెక్ట్ చేసారు. బిగ్ బాస్ ముందు ఒక నాలుగు ఇంటర్వ్యూలు చేసారు సెలెక్ట్ చేయడానికి. అప్పుడు నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అన్ని ఓకే అయి సెలెక్ట్ అయ్యాను. అంతకు ముందు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది కానీ అప్పుడు కాన్ఫిడెంట్ లేదు. అందుకే వద్దన్నాను. నాకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చి ఉంటే బిగ్ బాస్ కి వెళ్లేదాన్ని కాదు. కానీ బిగ్ బాస్ వల్ల నాకు హెల్ప్ అయింది. బిగ్ బాస్ కి వెళ్లే రోజు ఉదయం చాలా టెన్షన్ గా ఉంది. అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేసాను, నేను వచ్చేస్తాను, నా వల్ల కాదు అని చెప్పాను. కరోనా కావడంతో పార్క్ హోటల్ లో అప్పటికే 20 రోజులు లాక్ డౌన్ లో ఉంచారు. మా అమ్మ నువ్వు వెళ్ళు, ఎలా ఉన్నా మాకు ఓకే అని చెప్పింది. అప్పటిదాకా నన్ను తిట్టిన పేరెంట్స్ అప్పుడు నాకు గుడ్ డేస్ వచ్చాయి అని భావించారు. అప్పటిదాకా డబ్బులు సంపాదించట్లేదు అన్నారు. కానీ బిగ్ బాస్ లో వారానికి ఇంత అని ఇస్తారు కాబట్టి డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి అని ఓకే చెప్పారు అని తెలిపింది.

Also Read : Arundhati Child Artist : పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా..

అలాగే.. నేను బిగ్ బాస్ లో 7 వారాలు ఉన్నాను. ఆల్మోస్ట్ 50 రోజులు అప్పటికే అలిసిపోయాను. నాకు సైలెంట్ గా ఉండటం, ఒక్కదాన్నే ఉంటడం ఇష్టం. కానీ అక్కడ అందరూ గోలగోలగా ఉంటారు. ఒకరికొకరు తినిపించుకుంటారు, హగ్గులు ఇచ్చుకుంటారు, తెగ యాక్టింగ్ చేసేస్తారు కెమెరాల ముందు. నాకు అవన్నీ వచ్చేవి కాదు. నాగార్జున గారు నాకు మొదట్నుంచి సపోర్ట్ ఇచ్చారు. నేను దసరాకి ఎలిమినేట్ అయ్యాను. ఆ రోజు నాగార్జున గారు లేకపోవడంతో సమంత వచ్చింది. సమంత హోస్ట్ గా నన్ను ఎలిమినేట్ చేసారు. నాగార్జున గారు ఉంటే నేను ఇంకొన్ని రోజులు ఉండేదాన్ని ఏమో అని తెలిపింది. బిగ్ బాస్ జరిగిన ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ దివి తన ఎలిమినేషన్ గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Divi (@actordivi)