Gagana Geethika : ‘డాకు మహారాజ్’ కథని మలుపు తిప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలుసా? ఆమె తండ్రి కూడా నటుడే..
బాలకృష్ణ డాకు మహారాజ్ గా మారడానికి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కారణం అవుతుంది.

Do you Know about Balakrishna Daaku Maharaaj Child Artist Gagana Geethika Here Details
Gagana Geethika : ఇటీవల సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మాణంలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఓ మంచి మెసేజ్, ఎమోషన్ తో పాటు కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి రిలీజయి ఆల్మోస్ట్ 160 కోట్లకు పైగా గ్రాస్ సాధించి హిట్ అయింది.
ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సినిమా కథను పాయల్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ మలుపు తిప్పుతుంది. బాలకృష్ణ డాకు మహారాజ్ గా మారడానికి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కారణం అవుతుంది. డాకు మహారాజ్ లో అలాంటి కీలక పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు గగన గీతిక. నాలుగేళ్ళ అప్పట్నుంచి టిక్ టాక్ వీడియోలతో మొదలుపెట్టి సీరియల్స్, సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. లాయర్ విశ్వనాధ్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన గగన గీతిక ఆ తర్వాత RRR, నారప్ప, 18 పేజెస్, తెల్లవారితే గురువారం, 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం.. లాంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.
డాకు మహారాజ్ కంటే ముందు గగన గీతిక 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో చేసిన క్యారెక్టర్ తో కూడా బాగానే పాపులర్ అయింది. ప్రస్తుతం ఓదెల 2 సినిమాలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తుంది. గగన తండ్రి కూడా నటుడే కావడం గమనార్హం. గగన తండ్రి శ్రీతేజ్ హైదరాబాద్ డ్రీమ్స్ అనే సినిమాలో హీరోగా చేసాడు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కృష్ణతులసి, ఎద లయలో ఇంద్రధనస్సు.. లాంటి సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
Also Read : Trump Effect : ట్రంప్ నిర్ణయాలతో.. అమెరికాలో తెలుగు సినిమా కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్..?
ఇలా తండ్రి కూతుళ్ళు ఇద్దరూ సినిమాలు, సీరియల్స్ తో బిజీగానే ఉన్నారు. గగన గీతిక, ఆమె తండ్రి శ్రీతేజ్ ఇద్దరూ సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న గగన గీతిక భవిష్యత్తులో ఇంకెన్ని సినిమాల్లో కనిపించి మెప్పిస్తుందో చూడాలి.