Trump Effect : ట్రంప్ నిర్ణయాలతో.. అమెరికాలో తెలుగు సినిమా కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్..?

తెలుగు సినిమాలకు, ఇండియన్ సినిమాలకు అమెరికాలో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది.

Trump Effect : ట్రంప్ నిర్ణయాలతో.. అమెరికాలో తెలుగు సినిమా కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్..?

Trump Decisions Effect on Telugu Movies Collections Here the Details

Updated On : February 2, 2025 / 8:04 AM IST

Trump Effect : తెలుగు సినిమాలకు ఇండియా కాకుండా అమెరికా ఇప్పుడు పెద్ద మార్కెట్. మన సినిమా వాళ్ళు బిజినెస్ లెక్కలు వేసుకునేటప్పుడే అమెరికా కలెక్షన్స్ ని కూడా సపరేట్ గా లెక్కేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు అమెరికా నుంచి భారీగానే కలెక్షన్స్ వస్తున్నాయి. స్టార్ హీరోలు అయితే అమెరికా కలెక్షన్స్ రికార్డులు అని కూడా చెప్పుకుంటున్నారు. అమెరికాలో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టే ఇటీవల అమెరికాలో కూడా ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు టాలీవుడ్. మన హీరోలు, సినీ ప్రముఖులు అక్కడికి వెళ్తే జనాలు భారీగానే వస్తారు. కానీ ఇదంతా మొన్నటి వరకు, ఇప్పుడు పరిస్థితి మారింది.

ఇప్పుడు తెలుగు సినిమాలకు, ఇండియన్ సినిమాలకు అమెరికాలో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది. మన సినిమాల కలెక్షన్స్ పై ట్రంప్ ఎఫెక్ట్ పడనుంది అంటున్నారు. ఇటీవల ట్రంప్ వాళ్ళ దేశం వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ అని, వలసదారులపై స్ట్రిక్ట్ రూల్స్ అంటూ, అదే అక్రమ వలసదారులైతే పంపించేస్తామని వార్నింగ్స్ కూడా జారీ చేసారు. మన ఇండియా నుంచే, తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్ వీసా మీద వెళ్లిన చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేస్తూ బతుకుతారు. ఇప్పుడు చదువుకోడానికి అక్కడికి వెళ్లిన వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వీల్లేదు.

Also Read : Find Actor : చిరంజీవి ఎత్తుకున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా? హీరోగా ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్.. కానీ ఇప్పుడు..

ఇప్పటికే ఇండియన్ స్టోర్స్, రెస్టారెంట్స్‌లో పని చేస్తున్న స్టూడెంట్స్‌ను ఇమ్మిగ్రేషన్ రైడ్స్ భయంతో జాబ్స్ నుంచి తొలగిస్తున్నారట. దీంతో అక్కడున్న స్టూడెంట్స్ పరిస్థితి మరికొన్ని నెలలు గడిస్తే గానీ పూర్తిగా అర్థం కాకపోవచ్చు అని తెలుస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ అయోమయంలో పడ్డారు. మరోవైపు పోలీసులు అక్రమ వలసదారులను వెతికి వెతికి పట్టుకుంటున్నారు.

Also Read : Anasuya : నేను బికినీ వేసుకుంటే అది నా ఇష్టం.. ప్రతి వాళ్ళ లైఫ్ లో ఆడవాళ్లు ఉంటారు.. కర్మ తిరిగొస్తుంది.. అనసూయ వ్యాఖ్యలు..

అమెరికాలో మన తెలుగు, ఇండియన్ సినిమాలు చూసే వాళ్ళల్లో అక్కడ సెటిలైన ఇండియన్స్ తో పాటు ఇలా పార్ట్ టైం చేసుకుంటూ ఉండే స్టూడెంట్స్ ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సినిమాలకు డబ్బులు పెట్టాలంటే కచ్చితంగా ఆలోచిస్తారు. దీంతో ఈ ట్రంప్ ఎఫెక్ట్ మన తెలుగు సినిమాల కలెక్షన్స్ పై కూడా కచ్చితంగా పడుతుంది అని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు పార్ట్ టైం చేసుకోకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అలాంటప్పుడు ఇంక సినిమాలకేం వస్తారు అని అంటున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకునే నిర్ణయం డైరెక్ట్ గానే మన తెలుగు సినిమాల కలెక్షన్స్ పై పడనుంది. మరి ఇక నుంచి అమెరికా కలెక్షన్స్ లెక్కలు వేసుకోకుండా సినిమాలు తీస్తారా చూడాలి.