Find Actor : చిరంజీవి ఎత్తుకున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా? హీరోగా ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్.. కానీ ఇప్పుడు..
ఈ ఫొటో ఓ సినిమా ఈవెంట్ లోది అని తెలుస్తుంది. చిరంజీవి ఆ పిల్లాడిని ఎత్తుకొని షీల్డ్ ఇచ్చారు.

Do You Know this boy with Chiranjeevi in this Photo find the Hero Details Here
Find Actor : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయని తెలిసిందే. తాజాగా ఓ హీరో చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఆ హీరోని మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకుకోవడం విశేషం. ఈ ఫొటో ఓ సినిమా ఈవెంట్ లోది అని తెలుస్తుంది. చిరంజీవి ఆ పిల్లాడిని ఎత్తుకొని షీల్డ్ ఇచ్చారు. ఇంతకీ ఈ ఫొటోలో చిరంజీవి ఎత్తుకున్నది ఎవర్నో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఈ పిల్లాడు హీరో ఆది సాయి కుమార్. సాయి కుమార్ తనయుడు ఆది. ఈ ఫోటో 1991లో కలికాలం సినిమా సక్సెస్ ఫంక్షన్ లోనిది. కలికాలం సినిమా విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో సాయి కుమార్ షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారు. దీంతో సాయి కుమార్ తనయుడు ఆది.. సాయికుమార్ తండ్రి పి.జె శర్మ తో కలిసి ఆ వేడుకలో పాల్గొన్నారు. అప్పటికే ఆదికి చిరంజీవి అంటే ఇష్టం. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఆదిని ఇలా ఎత్తుకుని సాయికుమార్ అవార్డుని అందించారు.
అప్పట్లో ఒక సినిమా విజయం సాధిస్తే 50 రోజులు, 100 రోజుల వేడుకలు గ్రాండ్ గా చేసేవారు. సినిమాకు పనిచేసిన వారికి షీల్డ్స్, మెమొంటోలు ఇచ్చేవాళ్ళు. ముత్యాలసుబ్బయ్య దర్శకత్వంలో జయసుధ, చంద్రమోహన్, సాయికుమార్ మెయిన్ లీడ్స్ లో నటించిన కలికాలం సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాని జయసుధ భర్త నితిన్‌కపూర్ నిర్మించారు.
Also Read : Dance Ikon 2 : ఆహా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో వచ్చేసింది.. మెంటార్స్ ఎవరో తెలుసా?
చిరంజీవిని ఇన్ స్పైర్ గా చేసుకొని ఎదిగిన ఆది మొదటి సినిమా ప్రేమ కావాలి కూడా చిరంజీవి చేతుల మీదుగానే లాంచ్ అయింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని విజయాలు మాత్రమే సాధించాడు ఆది. ఆల్మోస్ట్ గత ఏడేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నా ఒక్క విజయం కూడా దక్కట్లేదు. అయినా కొత్త కొత్త కథలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఆది సాయి కుమార్. త్వరలో షణ్ముఖ అనే పాన్ ఇండియా మైథాలజీ సినిమాతో రాబోతున్నాడు ఆది సాయికుమార్.