Anasuya : నేను బికినీ వేసుకుంటే అది నా ఇష్టం.. ప్రతి వాళ్ళ లైఫ్ లో ఆడవాళ్లు ఉంటారు.. కర్మ తిరిగొస్తుంది.. అనసూయ వ్యాఖ్యలు..

తాజాగా అనసూయ తన డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసేవాళ్ళ గురించి మాట్లాడుతూ..

Anasuya : నేను బికినీ వేసుకుంటే అది నా ఇష్టం.. ప్రతి వాళ్ళ లైఫ్ లో ఆడవాళ్లు ఉంటారు.. కర్మ తిరిగొస్తుంది.. అనసూయ వ్యాఖ్యలు..

Anasuya Sensational Comments on Who Comments her Dressing

Updated On : February 2, 2025 / 6:40 AM IST

Anasuya : అప్పుడప్పుడు తన కామెంట్స్ తో వివాదాల్లో, వార్తల్లో నిలిచే అనసూయ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడింది. ఈ క్రమంలో తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి కూడా మాట్లాడింది. అనసూయ రెగ్యులర్ గా చీరలతో పాటు హాట్ హాట్ గా కనిపించే డ్రెస్సులు కూడా వేస్తూ కనిపిస్తుంది. అలాంటి డ్రెస్సులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీనిపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

Also Read : Anasuya : పవన్ తో సాంగ్ గురించి మాట్లాడిన అనసూయ.. అలాంటి సమయంలో షూటింగ్.. హీరో అంటే అలా ఉండాలి..

తాజాగా అనసూయ తన డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసేవాళ్ళ గురించి మాట్లాడుతూ.. నేను బట్టలు విప్పి తిరిగానా, బికినీ వేసుకున్నానా అనేది అది నా ఇష్టం. కానీ మీ పెంపకం ఎలా ఉండాలి. మీ ఊహలు మీ పెళ్ళాం, గర్ల్ ఫ్రెండ్ కే పరిమితం అవ్వాలి. మీరేమన్నా వదిలేసినా ఎద్దులా, మనుషులు. నేను ఎలా డ్రెస్ అవుతాను అనేది నా ఇష్టం. కొంతమంది నీ డ్రెస్ నీ ఇష్టం అంటే నా కామెంట్స్ నా ఇష్టం అంటారు. నా డ్రెస్ వల్ల నీకు హాని కలగట్లేదు. కానీ నీ కామెంట్స్ వల్ల నాకు హాని కలుగుతుంది. మీరు నన్ను అంటున్నారు. నేను రెడీ అయ్యేది నా కోసం. కానీ మీరు నన్ను కామెంట్స్ చేస్తారు ఆ హక్కు మీకు ఎక్కడిది. నేను కర్మని నమ్ముతాను. కర్మ తిరిగొస్తుంది. నన్ను కామెంట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆడవాళ్లు ఉంటారు. కర్మ తిరిగి వస్తుంది అంటూ వ్యాఖ్యలు చేసింది. దీంతో అనసూయ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read : Dance Ikon 2 : ఆహా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో వచ్చేసింది.. మెంటార్స్ ఎవరో తెలుసా?

యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ జబర్దస్త్ తో బాగా పాపులర్ అయింది. అనంతరం సినిమాలు, షోలలో వరుస ఛాన్సులు వచ్చాయి. సినిమాల్లో బిజీ అవ్వడంతో టీవీ షోలు తగ్గించేసింది. ప్రస్తుతం అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే పుష్ప 2 సినిమాలో ద్రాక్షాయని పాత్రలో ప్రేక్షకులను పలకరించింది.