Anasuya : పవన్ తో సాంగ్ గురించి మాట్లాడిన అనసూయ.. అలాంటి సమయంలో షూటింగ్.. హీరో అంటే అలా ఉండాలి..
పవన్ కళ్యాణ్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో అనసూయ ఒక స్పెషల్ సాంగ్ చేసింది.

Anasuya Comments on Work Experience with Pawan Kalyan
Anasuya : యాంకర్, నటి అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ మానేసి సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. కొన్నిరోజుల వరకు అనసూయ రెగ్యులర్ గా ఏదో ఒక కామెంట్స్ చేసి వివాదాల్లో నిలిచేది. ఇటీవల పెద్దగా వివాదాల్లోకి, వార్తల్లోకి రావట్లేదు.
తాజాగా అనసూయ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలు మాట్లాడింది. అందులో పవన్ కళ్యాణ్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో అనసూయ ఒక స్పెషల్ సాంగ్ చేసింది.
Also Read : Dance Ikon 2 : ఆహా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో వచ్చేసింది.. మెంటార్స్ ఎవరో తెలుసా?
అనసూయ మాట్లాడుతూ.. పవన్ గారితో గతంలోనే ఒక సాంగ్ ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో అలాంటి సాంగ్స్ చేయకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఛాన్స్ వస్తే ఓకే చెప్పాను. చాలా మంచి సాంగ్. క్యాచీగా ఉంటుంది. మాసివ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా రెస్పాన్సిబుల్ పొలిటీషియన్. షూటింగ్ గ్యాప్ లో కూడా ఎప్పుడూ బుక్స్ చదువుతూ ఉంటారు. ఓ పక్క పార్టీ పనుల్లో బిజీగా ఉంటూనే షూటింగ్ చేసారు. చాలా హెవీ వర్క్ తో ఓ పక్క సినిమా, మరో పక్క పాలిటిక్స్ మేనేజ్ చేసేవారు. ఆయన్ని చూస్తే ఇన్‌స్పైర్ గా అనిపిస్తుంది. చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. హీరో అంటే అలా ఉండాలి. చాలా వాటికి నో చెప్పారు. సెల్ఫ్ లెస్ గా ఉంటారు అని తెలిపింది.
Also Read : Sreeleela : టాలీవుడ్ అయిపోయింది.. ఇప్పుడు తమిళ్, బాలీవుడ్ మీద ఫోకస్ చేసిన శ్రీలీల..
ఇక మెగా ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడుతూ.. నేను బాబు గారితో జబర్దస్త్ వల్ల ఎక్కువగా వర్క్ చేసాను. చిరంజీవి గారితో కూడా చేసాను. ముగ్గురు అన్నదమ్ములు ఒకే రక్తం కాబట్టి అందరూ ఎంతో మంచిగా ఉంటారు. నన్ను మెగా కాంపౌండ్ నటి అని కూడా అంటారు. నేను మెగా ఫ్యామిలీలో అందరు హీరోలతో పనిచేసాను. ఒక్క వైష్ణవ్, శిరీష్ తోనే వర్క్ చేయాలి అని చెప్పింది. ఇక పవన్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికే టీజర్స్, సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఈ సినిమా మార్చ్ 28 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.