Jabardasth Comedian : డైరెక్టర్ కాబోతున్న మరో జబర్దస్త్ కమెడియన్.. ఎవరో తెలుసా..?
తాజాగా మరో కమెడియన్ దర్శకుడు కాబోతున్నాడు. (Jabardasth Comedian)
Jabardasth Comedian
Jabardasth Comedian : జబర్దస్త్ ఎంతోమంది ఆర్టిస్టులకు, రైటర్లకు లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ తో చాలా మంది సెలబ్రిటీలు అయ్యారు, లైఫ్ లో సెటిల్ అయ్యారు. జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్నవాళ్ళు ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. అయితే అదే జబర్దస్త్ కమెడియన్స్ లో కొంతమంది దర్శకులు కూడా అయ్యారు.
ఇప్పటికే జబర్దస్త్ నుంచి కమెడియన్స్ వేణు, ధనరాజ్, అదిరే అభి దర్శకులుగా మారి సినిమాలు తీసి మెప్పించారు. కిరాక్ ఆర్పీ కూడా దర్శకుడిగా సినిమా ప్రకటించాడు. తాజాగా మరో కమెడియన్ దర్శకుడు కాబోతున్నాడు.
Also Read : Allu Sneha Reddy : అల్లు వారింట మొదలయిన పెళ్లి వేడుక.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య..
అతనెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్. రచయితగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ ప్రసాద్ ఆ తర్వాత సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి స్కిట్స్ చేస్తూ ఆర్టిస్ట్ గా కూడా మారాడు. జబర్దస్త్ లో ఇప్పటికి స్కిట్స్ రాస్తూ కామెడీ చేస్తూ మరో పక్క సినిమాలో కూడా అడపాదడపా నటిస్తున్నాడు. తాజాగా యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్ కి గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇందులో గెటప్ శ్రీను మాట్లాడుతూ.. రామ్ ప్రసాద్ డైరెక్టర్ అవ్వాలి. త్వరలో కాబోతున్నాడు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి అని తెలిపాడు. దీంతో రామ్ ప్రసాద్ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాల బిజీతో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ వదిలేయగా త్వరలోనే డైరెక్టర్ అయితే రామ్ ప్రసాద్ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతున్నాడని తెలుస్తుంది.

Also Read : Aura Of Ustaad : పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్.. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ వచ్చేసింది..
