Sreeleela : టాలీవుడ్ అయిపోయింది.. ఇప్పుడు తమిళ్, బాలీవుడ్ మీద ఫోకస్ చేసిన శ్రీలీల..
లాస్ట్ ఇయర్ తెలుగులో కుర్చీమడతపెట్టేసిన శ్రీలీల ఈ సంవత్సరం తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మడతపెట్టేయబోతోంది.

After Tollywood Success Sreeleela entering into Tamil and Hindi Film Industry
Sreeleela : లాస్ట్ 2,3 ఇయర్స్ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన శ్రీలీల సడెన్ గా మాయమైపోయింది. అందేంటంటే గ్యాప్ రాలా తీసుకున్నా అంటోంది. చదువుతో బిజీగా ఉన్నాను అని చెప్పింది. ఈ గ్యాప్ కి రీజన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకూ తెలుగులోనే బిజీగా ఉన్న శ్రీలీల తమిళ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు రెడీ చేస్కోడానికే బ్రేక్ తీసుకుంది.
లాస్ట్ ఇయర్ తెలుగులో కుర్చీమడతపెట్టేసిన శ్రీలీల ఈ సంవత్సరం తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మడతపెట్టేయబోతోంది. టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా వరసపెట్టి అందరితో సినిమాలు చేసిన, చేస్తున్న ఈ హ్యాపెనింగ్ హీరోయిన్ ఈ సంవత్సరం తన టార్గెట్ ని తమిళ్, హిందీ సినిమాలకు ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే తమిళ్ లో తన ఫస్ట్ మూవీ టీజర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.
Also Read : Dil Raju : ఫేక్ కలెక్షన్స్ పై దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్స్ కామెంట్స్.. ఫ్లాప్ అయినా హిట్ పోస్టర్స్ అంటూ..
శివకార్తికేయన్, అథర్వ, శ్రీలీల లీడ్ రోల్స్ లో సుధకొంగర డైరెక్షన్లో తెరకెక్కుతున్నపరాశక్తి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ లో శ్రీలీల రెట్రో లుక్, క్యారెక్టర్ ఇంట్రస్టింగ్ గా కనిపిస్తోంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ రివల్యూషనరీ డ్రామాగా తెరకెక్కుతున్న పరాశక్తి తో ఫస్ట్ టైమ్ తమిళ్ లో ఎంట్రీ ఇస్తోంది శ్రీలీల. ఇప్పటి వరకూ తెలుగులో బిజీగా ఉన్న శ్రీలీల ఈ సంవత్సరం నుంచి తమిళ్ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చెయ్యబోతోంది.
Also Read : Naga Chaitanya : బాబోయ్.. శోభితని తెగ పొగిడేసిన చైతూ.. ప్రతిదీ తనని అడిగాకే..
ఈ సంవత్సరం తమిళ్ లోనే కాదు తన డ్రీమ్ డెబ్యూట్ ని బాలీవుడ్ లో కూడా ఇవ్వబోతోంది శ్రీలీల. ఇప్పటికే 2, 3 ప్రొడక్షన్ హౌజ్ లతో సిట్టింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తో ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇబ్రహీం, శ్రీలీల ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు అని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు కార్తిక్ ఆర్యన్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన తుమేరీ మే తేరా సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలే అంటూ బాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇలా ఈ సంవత్సరం ఇటు తమిళ్, అటు హిందీలో తెరంగేట్రం చెయ్యబోతోంది శ్రీలీల. మరి అక్కడ కూడా టాలీవుడ్ సక్సెస్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
View this post on Instagram