Dil Raju : ఫేక్ కలెక్షన్స్ పై దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్స్ కామెంట్స్.. ఫ్లాప్ అయినా హిట్ పోస్టర్స్ అంటూ..
దిల్ రాజు ఫేక్ కలెక్షన్స్ పై ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ..

Dil Raju and Some Distributors Speak about Fake Collections in Film Industry
Dil Raju : గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో ఫేక్ కలెక్షన్స్ హవా నడుస్తుంది. ఫ్యాన్స్ కోసం నిర్మాతలు, హీరోలు కొన్ని పెద్ద సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారని, వచ్చిన దానికంటే ఎక్కువగా వేసి రికార్డులు సాధించామని చెప్తున్నారని అంతా భావిస్తున్నారు. కొంతమంది సినిమా వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా అవును అనే అంటున్నారు. ఫ్యాన్స్ ని మెప్పించడానికి, జనాల్ని థియేటర్స్ కి రప్పించడానికి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ అని అంతా భావిస్తున్నారు.
ఇటీవల పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్ సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ వేశారని అంటున్నారు. వీటిపై నిర్మాతలు కానీ మూవీ యూనిట్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరూ మాట్లాడలేదు. అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ జరిగింది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ లోనే తీసిన ఈ సినిమా ఇప్పటికే 270 కోట్ల గ్రాస్ దాటి 300 కోట్లకు పరిగెడుతుంది.
Also Read : Naga Chaitanya : బాబోయ్.. శోభితని తెగ పొగిడేసిన చైతూ.. ప్రతిదీ తనని అడిగాకే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్లందరికీ డబల్, ట్రిపుల్ ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పారు. అయితే ఈ ఈవెంట్లో దిల్ రాజు ఫేక్ కలెక్షన్స్ పై ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ.. బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. నష్టపోయినప్పుడు కూడా సూపర్ హిట్ పోస్టర్స్ పడతాయి. సినీ పరిశ్రమలో ఇప్పుడు కల్చర్ మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో 10 శాతమే సక్సెస్ రేట్. 90 శాతం నష్టాలే ఉన్నాయి. ఇటీవల ఐటీ రైడ్స్ జరిగినప్పుడు 90 శాతం ఫ్లాప్స్ అని లాస్ట్ ఇయర్ షీట్ చూపించాం. సినిమా ఫ్లాప్స్ వస్తున్నా సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని అడిగారు అంటూ చెప్పడంతో ఫ్లాప్ వచ్చినా హిట్ అని వేసిన సినిమాలేంటో అని చర్చగా మారింది.
ఇక ఇదే ప్రెస్ మీట్ లో సీనియర్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మాట్లాడుతూ.. సినిమా కలెక్షన్స్ గురించి నిజాలు చెప్పకూడదు. మా డిస్ట్రిబ్యూటర్స్ దరిద్రం అదే. నిజాలు చెప్తే నెక్స్ట్ సినిమా ఇవ్వరు. మేము బయటకెళ్లి మాట్లాడకూడదు. మేము డబ్బులు పోగొట్టుకున్నా పోయిందని చెప్పకూడదు. నష్టపోయి నెక్స్ట్ సినిమా లేకుండా అవుతాము. జనాలు కలెక్షన్స్ చూసి నవ్వుకుంటున్నారు అని అన్నారు. దీంతో నేడు ప్రెస్ మీట్ లో దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్ గానే సినిమా ఫ్లాప్ అయినా హిట్ పోస్టర్స్ వేస్తున్నాం, నష్టాలు వచ్చినా చెప్పకూడదు అని అనడంతో ఇప్పటి వరకు చాలా సినిమాలకే ఫేక్ కలెక్షన్స్ వేశారని అర్ధమవుతుంది. ఇప్పటికైనా ఫ్యాన్స్ ఈ కలెక్షన్స్ విషయంలో మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని కొట్టుకోవడం మానేస్తే మంచిది. వచ్చే కలెక్షన్స్ ఎలాగో వస్తాయి. వాటి వల్ల ఫ్యాన్స్ కి ఫ్యాన్ వార్స్ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. అలాంటప్పుడు ఫేక్ కలెక్షన్స్ కోసం ఫ్యాన్స్ వార్స్ చేసుకోవడం ఎందుకని సినిమా లవర్స్ అభిప్రాయపడుతున్నారు.