Priyanka Chopra : వామ్మో.. మహేష్ రాజమౌళి సినిమాకు ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఫస్ట్ టైం ఒక హీరోయిన్ కి ఆ రేంజ్ లో..

మహేష్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

Priyanka Chopra : వామ్మో.. మహేష్ రాజమౌళి సినిమాకు ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఫస్ట్ టైం ఒక హీరోయిన్ కి ఆ రేంజ్ లో..

Priyanka Chopra Remuneration for Mahesh Babu Rajamouli Movie SSMB 29 Became Viral

Updated On : February 1, 2025 / 6:06 PM IST

Priyanka Chopra : ఎలాంటి అప్డేట్స్ లేకుండానే ఎన్నో అంచనాలు నెలకొన్న రాజమౌళి – మహేష్ బాబు సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో SSMB29 షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ 800 నుంచి 1000 కోట్ల బడ్జెట్ అని అంటున్నారు. రాజమౌళి, మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోకుండా వచ్చిన ప్రాఫిట్స్ లో కొంత శాతం తీసుకుంటున్నారని సమాచారం.

ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ప్రియాంక హైదరాబాద్ లోనే ఉండి షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే ప్రియాంకకు ఇచ్చే రెమ్యునరేషన్ పై టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. మహేష్ – రాజమౌళి సినిమాకు ప్రియాంక చోప్రాకు దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ హీరోయిన్. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంకా హాలీవుడ్ లో ఛాన్సులు రావడంతో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకొని హాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది.

Also Read : Salman Khan : యాక్సిడెంట్‌కి గురైన సల్మాన్ చెల్లి.. హాస్పిటల్ బెడ్ పై దీన స్థితిలో.. నాలుగు రోజులవుతున్నా స్పందించని సల్మాన్..

బాలీవుడ్ లోనే హీరోయిన్స్ కి 10 కోట్ల పైనే ఉంటాయి రెమ్యునరేషన్స్. ఇక హాలీవుడ్ హీరోయిన్ రెమ్యునరేషన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించొచ్చు. రాజమౌళి కూడా RRR తో హాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకే మహేష్ సినిమాకి హాలీవుడ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. దానికి తగ్గట్టే హాలీవుడ్ రెమ్యునరేషన్ ఇప్పిస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రాతో హాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసుకోవచ్చు, మార్కెట్ చేసుకోవచ్చు అని రాజమౌళి ప్లాన్.

Also Read : Thandel Pre Release Event : ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అల్లు అర్జున్ వస్తున్నాడు కానీ.. ఫ్యాన్స్ కి నిరాశే..

అందుకే ప్రియాంక చోప్రాకు ఆల్మోస్ట్ 30 కోట్ల రెమ్యునరేషన్ ఇప్పించాడట రాజమౌళి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదు. మన దగ్గర హీరోయిన్స్ కి 3 నుంచి 5 కోట్ల వరకు హైయెస్ట్ ఇస్తున్నారు. బాలీవుడ్ లో కొంతమంది 10 నుంచి 20 వరకు తీసుకుంటున్నారు. అలాంటిది ప్రియాంక చోప్రాకు ఏకంగా టాలీవుడ్ లో తీసే సినిమాకు 30 కోట్ల రెమ్యునరేషన్ అంటే రికార్డ్ అని చెప్పొచ్చు. ఇక మహేష్ రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని సమాచారం.