Thandel Pre Release Event : ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అల్లు అర్జున్ వస్తున్నాడు కానీ.. ఫ్యాన్స్ కి నిరాశే..

సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈవెంట్స్ లో ఇప్పటివరకు కనిపించలేదు.

Thandel Pre Release Event : ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అల్లు అర్జున్ వస్తున్నాడు కానీ.. ఫ్యాన్స్ కి నిరాశే..

Allu Arjun coming to Thandel Movie Pre Release Event even Fans Disappointed

Updated On : February 1, 2025 / 4:18 PM IST

Thandel Pre Release Event : నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగాల్సి ఉంది కానీ పలు కారణాలతో రేపటికి వాయిదా వేశారు. ఫిబ్రవరి 2 సాయంత్రం తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. తండేల్ గీత ఆర్ట్స్ సినిమా కావడంతో ఈ సినిమా ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నట్టు ప్రకటించారు.

ఇటీవల పుష్ప 2 రిలీజ్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈవెంట్స్ లో ఇప్పటివరకు కనిపించలేదు. ఆ ఘటన తర్వాత మొదటిసారి అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్ కి వస్తున్నాడు, బయటకి వచ్చి మీడియా ముందు మాట్లాడతాడు అని తెలియడంతో ఈ ఈవెంట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Allu Aravind : అల్లు అరవింద్ కి పెళ్లి పీటల మీద నుంచే శోభిత రిక్వెస్ట్.. నాగ చైతన్య గురించి ఏం అడిగింది అంటే..?

అయితే మొదట పబ్లిక్ ఈవెంట్, అవుట్ డోర్ లో పెడదాం అనుకున్నారు. కానీ పోలీస్ పర్మిషన్ రాలేదు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అవుట్ డోర్ పర్మిషన్ ఇవ్వలేదు అని సమాచారం. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈవెంట్ కి వచ్చి అల్లు అర్జున్ ని చూడొచ్చు అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అవుట్ డోర్ ఈవెంట్ కాదు అని తెలియడంతో నిరాశ చెందుతున్నారు.

టాలీవుడ్ సమాచారం ప్రకారం తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో సింపుల్ గా చేయనున్నారు. కేవలం మూవీ యూనిట్, మీడియా మధ్యే ఈ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో కూడా మూవీ యూనిట్ ప్రకటించలేదు. ప్లేస్ తెలిస్తే బన్నీ కోసం అభిమానులు భారీగా వస్తారని ప్రకటించలేదు. కేవలం ఈవెంట్, టైం మాత్రమే ప్రకటించారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఫ్యాన్స్ యూట్యూబ్ లోనో, టీవీలోనో చేసుకోవాల్సిందే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని.

Also Read : Udit Narayan : 69 ఏళ్ళ వయసులో.. లైవ్ షోలో అమ్మాయికి లిప్ కిస్ ఇచ్చిన సీనియర్ స్టార్ సింగర్.. వివాదం చెలరేగడంతో..

మరి పుష్ప 2 సక్సెస్, సంధ్య థియేటర్ ఘటన తర్వాత మొదటిసారి అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్ కి వచ్చి ఏం మాట్లాడతాడో చూడాలి. ఇక తండేల్ సినిమా శ్రీకాకుళంకు చెందిన కొంతమంది జాలర్లు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి పట్టుబడితే అక్కడ్నుంచి ఎలా బయటకు వచ్చారు అనే రియల్ కథకు ఓ ప్రేమ కథని జోడించి తెరకెక్కిస్తున్నారు.