Salman Khan : యాక్సిడెంట్‌కి గురైన సల్మాన్ చెల్లి.. హాస్పిటల్ బెడ్ పై దీన స్థితిలో.. నాలుగు రోజులవుతున్నా స్పందించని సల్మాన్..
ఇటీవల సల్మాన్ ఖాన్ చెల్లికి యాక్సిడెంట్ అయింది.

Salman khan Sister Shweta Rohira Met with Accident and join in Hospital Slaman Khan didn't Reacts
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల ఇల్లు, షూటింగ్ తప్ప ఇంకేం పట్టించుకోవట్లేదు. గత కొన్ని రోజులుగా సల్మాన్ కి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్ ఎక్కడికి వెళ్లినా ఫుల్ సెక్యూరిటీతో వెళ్తున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడుతున్నాడు. ప్రస్తుతం సికిందర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సల్మాన్. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ చెల్లికి యాక్సిడెంట్ అయింది.
సల్మాన్ చెల్లి అంటే సొంత సోదరి కాదు. సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్ సునీల్ రోహిరా కూతురు శ్వేతా రోహిరా సల్మాన్ కి చిన్నప్పట్నుంచి రాఖీ కడుతూ అన్నయ్య అని పిలుస్తుంది. సునీల్ మరణించాక శ్వేతా రోహిరా, అతని సోదరుని యోగక్షేమాలు సల్మాన్ చూసుకుంటున్నాడు. సొంత సోదరి కాకపోయినా సల్మాన్ శ్వేతాని తన సొంత చెల్లిలాగే చూసుకుంటాడు. అయితే నాలుగు రోజుల క్రితం శ్వేతాకు ముంబై రోడ్లపై భారీ యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ లో శ్వేతా తీవ్రంగా గాయపడింది. ఆల్రెడీ కొన్ని సర్జరీలు కూడా అయ్యాయి.
ప్రస్తుతం శ్వేతా హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకుంటుంది. ఇటీవల శ్వేతా ఒంటి మీద కట్లతో హాస్పిటల్ బెడ్ పై దీన స్థితిలో పడుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పి, హాస్పిటల్ లో ఉన్నాను, ఎముకలు విరిగాయి. సర్జరీలు జరిగాయి. కదల్లేని స్థితిలో ఉన్నాను. జీవితంలో కష్ట సమయం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. నేను మళ్ళీ తిరిగి వస్తాను అని పోస్ట్ చేసింది. దీంతో శ్వేతా కోలుకోవాలని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల్లో నటించకపోయినప్పటికీ శ్వేతా సోషల్ మీడియాతో బాగానే పాపులర్ అయింది. సల్మాన్ సోదరిగా బాలీవుడ్ లో అందరికి పరిచయమే. నటుడు పుల్కిత్ సామ్రాట్ ని పెళ్లి చేసుకొని అనంతరం విడాకులు తీసుకొని వైరల్ అయింది. అయితే శ్వేతా ఇప్పుడు గాయాలతో హాస్పిటల్ లో ఉంటే సల్మాన్ ఖాన్ వచ్చి పరామర్శించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు రోజులు అయినా చెల్లికి ఇలా జరిగితే ఎందుకు రాలేదు సల్మాన్ అని ప్రశ్నిస్తున్నారు. అయితే సల్మాన్ సన్నిహితులు మాత్రం ఆల్రెడీ శ్వేతా రోహిరాతో ఫోన్ లో మాట్లాడాడు అని, సల్మాన్ ఖాన్ కి ఉన్న భద్రతా కారణాల వల్లే హాస్పిటల్ కి వెళ్లట్లేదు అని, తను డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళాక వెళ్లి కలుస్తాడని అంటున్నారు.