Balakrishna : ‘మ్యాన్షన్ హౌజ్’కి నీకు సంబంధం ఏంటి? బాలయ్యకు నారా భువనేశ్వరి ప్రశ్న.. బాలయ్య ఏం చెప్పాడో తెలుసా?

నిన్న రాత్రి బాలకృష్ణ చెల్లి, సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ అవార్డు రావడంతో స్పెషల్ పార్టీ ఇచ్చింది.

Balakrishna : ‘మ్యాన్షన్ హౌజ్’కి నీకు సంబంధం ఏంటి? బాలయ్యకు నారా భువనేశ్వరి ప్రశ్న.. బాలయ్య ఏం చెప్పాడో తెలుసా?

Nara Bhuvaneshwari Question to Balakrishna About Mansion House in Nara Nandamuri Special Event

Updated On : February 2, 2025 / 1:10 PM IST

Balakrishna : బాలకృష్ణ గత కొన్నాళ్లుగా వరుస హిట్స్ తో, రాజకీయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా నిన్న రాత్రి బాలకృష్ణ చెల్లి, సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ అవార్డు రావడంతో స్పెషల్ పార్టీ ఇచ్చింది.

ఈ పార్టీకి నారా, నందమూరి కుటుంబాలతో పాటు సినీ పరిశ్రమలో బాలయ్యకు సన్నిహితంగా ఉండే పలువురు హాజరయ్యారు. అయితే బాలయ్య వల్ల మ్యాన్షన్ హౌజ్ అనే ఆల్కహాల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య మ్యాన్షన్ హౌజ్ తాగుతారని అంటారు. బాలయ్య కూడా డైరెక్ట్ గానే దాని గురించి మాట్లాడారు. బాలయ్య వల్ల మ్యాన్షన్ హౌజ్ ఎంత వైరల్ అయిందంటే ఆహాలో బాలయ్య హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షోకి మ్యాన్షన్ హౌజ్ స్పాన్సర్ చేస్తుంది.

Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్ లైనప్ అదిరిందిగా.. బ్యాక్ టు బ్యాక్ హిట్ డైరెక్టర్స్ తో బాస్..

నిన్న జరిగిన పార్టీలో నారా భువనేశ్వరి స్టేజిపై మాట్లాడుతూ తన అన్న బాలకృష్ణను.. నీకు మ్యాన్షన్ హౌజ్ కి సంబంధం ఏంటి? వసుంధర కంటే మ్యాన్షన్ హౌజ్ ఎక్కువయిపోయిందా? ఎప్పుడూ చంకలో పెట్టుకొని వెళ్తావంట అని సరదాగా అడిగారు. దీనికి బాలయ్య కూడా ఆసక్తిగా సమాధానమిచ్చారు. బాలయ్య తన చెల్లి భువనేశ్వరి అడిగిన దానికి సమాధానమిస్తూ.. నా లైఫ్ లో అన్ని యాదృచ్ఛికంగానే జరిగాయి. మ్యాన్షన్ హౌజ్ అలవాటు కూడా అలాగే అయింది. అంతే కానీ దాంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏమి లేదు. అదే నన్ను ప్రేమించింది. వసుంధర, మ్యాన్షన్ హౌజ్ నాకు రెండు కళ్ళు. నాన్న గారు ఇల్లు కట్టించారు. ఆ ఇల్లు మ్యాన్షన్ తో సమానం. ఆ మ్యాన్షన్ లో మ్యాన్షన్ హౌజ్ ఉంటుంది అని తెలిపారు.

Also Read : Pavani Karanam : పుష్పలో బన్నీని చిన్నాయన అని పిలిచే అమ్మాయి.. పావని.. సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ గా..

దీంతో బాలయ్య మ్యాన్షన్ హౌజ్ సమాధానం వైరల్ గా మారింది. ఇదే ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరితో పాటు బాలయ్య సోదరీమణులు పురంధేశ్వరి, మరొకరు స్టీజిపై కూర్చొని బాలయ్యని సరదాగా ఇంటర్వ్యూ చేసారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది. ఇక బాలయ్య ఇటీవల సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించి వరుసగా నాలుగో హిట్ కొట్టారు. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో ఉన్నారు.