Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

అన్ని పంటల సరళిలో ఒద్ధికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏక పంటగానే కాక పలు అంతర, మిశ్రమపంటల కలయికతో వీటిసాగు ఆశాజనకంగా వుంది. తక్కువ వ్యవధిలోనే పంటచేతికొచ్చి, తర్వాత వేయబోయే పంటలకు అనువుగా వుండటంతో సాగు మరింత లాభదాయకంగా వుంది.

Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

Rabi Season

Rabi Corps : ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో ఖరీఫ్ లో వర్షాధారంగా పండించే పంటల సాగు కూడా ఆలస్యమైంది. కొన్ని చోట్ల  రైతులు అదనులో ఏ పంటలు విత్తుకోలేక పోయారు. అలాంటి రైతులు నీటి వసతి ఉంటే రబీ పంటలుగా పప్పుదినుసులు, నూనెగింజ పంటల ను విత్తుకోవచ్చని సూచిస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం , సహ సంచాలకులు శ్రీనివాస్.

READ ALSO : Organ Donation : అవయవ దానం సమయంలో ముందస్తుగా నిర్వహించే పరీక్షలు ఇవే !

రానురాను తెలుగురాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గతకొంత కాలంగా ఆకర్షణీయంగా వున్న మార్కెట్ ధరలు… సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణలు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమయింది.

READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

అన్ని పంటల సరళిలో ఒద్ధికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏక పంటగానే కాక పలు అంతర, మిశ్రమపంటల కలయికతో వీటిసాగు ఆశాజనకంగా వుంది. తక్కువ వ్యవధిలోనే పంటచేతికొచ్చి, తర్వాత వేయబోయే పంటలకు అనువుగా వుండటంతో సాగు మరింత లాభదాయకంగా వుంది. ఖరీఫ్‌లో వేసిన పంటలు ప్రస్తుతం చివరి దశకు చేరుకోవటం, అలాగే ఏపంటా వేయకుండా ఖాలీగా వున్న ప్రాంతాల్లో ప్రస్తుతం అపరాలు విత్తేందుకు అనువైన సమయమని రైతులకు సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం , సహ సంచాలకులు శ్రీనివాస్.