Organ Donation : అవయవ దానం సమయంలో ముందస్తుగా నిర్వహించే పరీక్షలు ఇవే !

అవయవం అమర్చేవారి ఆరోగ్య రక్షణకోసం ముందుగా దాతకు HIV, హెపటైటిస్ B మరియు C, సిఫిలిస్ , క్షయ వంటి అంటు వ్యాధుల పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురికాలేదని నిర్ధారించడంలో సహాయపడతాయి.

Organ Donation : అవయవ దానం సమయంలో ముందస్తుగా నిర్వహించే పరీక్షలు ఇవే !

organ donation

Organ Donation : అవయవ దానం అన్నది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. అవయవ దానం సమయంలో ముందుగా దాత , గ్రహీత ఇద్దరి ఆరోగ్యం విషయం గురించి ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకుగాను కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. ఎవరైన అవయవ దానం చేయాలనుకుంటే ముందుగా మీకు నిర్వహించే కీలకమైన పరీక్షల గురించిన సమాచారంపై అవగాహన కలిగి ఉండటం మంచిది.

READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

భారతదేశంలో అవయవ దానం చేసేవారికి చేసే పరీక్షలు ;

1. బ్లడ్ గ్రూప్ పరీక్ష

ఒక అవయవాన్ని దానం చేసే ముందు, అవయవం అమర్చే వారికి అనుకూలంగా దాత రక్తం ఉందో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. సాధారణ రక్త పరీక్ష దీనిని గుర్తిస్తుంది. భారతదేశంలో అత్యంత సాధారణ రక్తం రకాలు A, B, O , AB. వీటిన రక్త పరిక్ష ద్వారా సరిపోల్చి చూస్తారు. ఎందుకంటే సమస్యలను నివారించడానికి , అవయవ మార్పిడి విజయవంతం కావటానికి ఇది చాలా కీలకం.

READ ALSO : Nara Lokesh: విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా? వాళ్లకు బుర్రా బుద్దీ ఏమైంది..? ఢిల్లీలో లోకేశ్ దీక్ష

2. ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్క్రీనింగ్

అవయవం అమర్చేవారి ఆరోగ్య రక్షణకోసం ముందుగా దాతకు HIV, హెపటైటిస్ B మరియు C, సిఫిలిస్ , క్షయ వంటి అంటు వ్యాధుల పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురికాలేదని నిర్ధారించడంలో సహాయపడతాయి. అలాగే అవయవదానం తరువాత గ్రహీతకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. పూర్తి స్ధాయిలో రక్త గణన (CBC)

CBC పరీక్ష ఎరుపు, తెల్ల రక్త కణాలతో సహా రక్తంలోని వివిధ భాగాలను కొలవడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. ఈ పరీక్ష అవయవం దానం చేసే ముందు శరీరం అనుకూలంగా ఉందో లేదో, ఏవైనా అంతర్లీన వైద్య పరిస్థితులను వెల్లడిస్తుంది.

READ ALSO : Kottu Satyanarayana : అమరావతి భూ కుంభకోణంలో పవన్ కల్యాణ్‌కి కూడా వాటా ఉంది- మంత్రి కొట్టు సంచలన ఆరోపణలు

చివరగా అవయవ దానం చేసే సమయంలో దాత , గ్రహీత ఇద్దరి ఆరోగ్యం , భద్రత చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో పైన పేర్కొన్న పరీక్షలు చాలా కీలకమైనవి.

గమనిక : వైద్య మార్గదర్శకాలు, సిఫార్సులు సమయాన్ని బట్టి మారుతుంటాయి. తదనుగుణంగా వైద్య నిపుణులు పరీక్షలను సూచిస్తుంటారు. దయచేసి గమనించగలరు. పూర్తిస్ధాయి సమాచారం కోసం వైద్య నిపుణుల సలహాలకోసం వారిని సంప్రదించడం మంచిది.