Agriculture Tips : 4 ఎకరాల్లో 150 రకాల పండ్లతోట నిరంతరం ఆదాయం

ఒకే పంటపై ఆధారపడిన సంధర్బాల్లో రైతుకు రిస్కు పెరగటంతోపాటు,  ఆదాయం కూడా నామ మాత్రమే. పాక్షిక నీడలో పెరిగే పసుపు మొక్కలు.. అలాగే అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్లతో ఏడాది పొడవునా దిగుబడులను తీయటమే కాకుండా బాడర్ క్రాపుగా వాక్కాయ నాటారు.

Agriculture Tips : 4 ఎకరాల్లో 150 రకాల పండ్లతోట నిరంతరం ఆదాయం

varieties of orchard

Agriculture Tips : పంటల సాగులో రైతు యొక్క చిట్టచివరి లక్ష్యం అధికోత్పత్తి . కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపధ్యంలో సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం తీసే దిశగా రైతు ఆలోచనా విధానం వుండాలి. ఈ గమ్యంలో ఆటుపోట్లు అనేకం .అయితే సుస్థిర వ్యవసాయంతో  రైతు ఆర్థిక ప్రగతికి డోకా లేదని నిరూపిస్తున్నారు  కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఒకే పంటపై ఆధారపడకుండా మిశ్రమ వ్యవసాయంతో  రిస్కును తగ్గించుకుని  మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జామ, వాటర్ యాపిల్ ప్రధాన పంటగా ఇతర పండ్ల మొక్కలను మిశ్రమ పంటలుగా సాగుచేసి, ఒక పంటలో పెట్టుబడిని రాబట్టుకుని, మరో పంటలో లాభాలు తీస్తున్నాడు. స్ఫూర్తిదాయకమైన  ఈ సాగు విధానాన్ని మనమూ తెలుసుకుందాం..

READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !

పచ్చని మొక్కలతో కళకళలాడుతున్న ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడండి.. మొత్తం 4 ఎకరాలు.. మొదట ప్రధాన పంటలుగా తైవన్ జామ, వాటర్ యాపిల్ సాగుచేసిన ఈ రైతు పేరు పర్వతనేని వెంకట శ్రీనివాస్. కృష్ణ జిల్లా, కంకిపాడు మండలం, ఈడుపుగల్లు గ్రామానికి చెందిన ఈయన మొక్కల మధ్య దూరాన్ని వృధా చేయడం ఇష్టం లేక అంతర పంటలుగా అరటి, మునగ, చింత, జామ, మామిడి, బొప్పాయి, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరి, ఫల్సా లాంటి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు. ప్రతి మొక్కనుండి సీజన్, అన్ సీజన్ లలో కూడా దిగుబడిని తీసుకుంటున్నారు. ప్రస్తుతం మామిడి, చింత చిగురు , మునగ దిగుబడులు వస్తున్నాయి. వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెటింగ్ చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

ఒకే పంటపై ఆధారపడిన సంధర్బాల్లో రైతుకు రిస్కు పెరగటంతోపాటు,  ఆదాయం కూడా నామ మాత్రమే. పాక్షిక నీడలో పెరిగే పసుపు మొక్కలు.. అలాగే అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్లతో ఏడాది పొడవునా దిగుబడులను తీయటమే కాకుండా బాడర్ క్రాపుగా వాక్కాయ నాటారు. వీటిపై నిరంతర ఆదాయం పొందడమే కాకుండా దీర్ఘకాలం తరువాత అధిక మొత్తంలో ఆదాయం కోసం మహాఘని లాంటి కలప మొక్కలను సైతం పొందుతున్నారు రైతు.