Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. అలాగే క్యారెట్‌లో నైట్రేట్ ఉంటుంది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను  ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !

heart healthy

Heart Healthy : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటేఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మన ఆహారపు అలవాట్లు , జీవనశైలి వల్ల ఇటీవలి కాలంలో గుండె ప్రమాదంలో పడింది. భారతదేశంలో గుండె జబ్బుల రోగుల సంఖ్య పెరుగటానికి ప్రధాన కారణాలు కూడా అవే. గుండె జబ్బులు అన్ని వయసుల వారిలో ఉత్పన్నం అవుతున్నాయి. భారతదేశంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి అతి పెద్ద కారణం జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామానికి దూరంగా ఉండటం వంటివి. ఇతర వ్యాధుల కంటే గుండె జబ్బులు వల్ల ప్రతి సంవత్సరం ఎక్కువగా మరణిస్తున్నారు.

READ ALSO : Vitamin D Deficiency : విటమిన్ డి లోపాన్ని నివారించటానికి సహాయపడే జీవనశైలి మార్పులు !

ఆరోగ్యకరమైన గుండె వల్ల మన శరీరంలోని మిగిలిన భాగాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. గుండెను ఆరోగ్యంగా ఉంచే పానీయాల గురించి ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Eye Health : కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు

క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ :

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. అలాగే క్యారెట్‌లో నైట్రేట్ ఉంటుంది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

READ ALSO : Diwali bonus : టీ ఎస్టేట్ ఉద్యోగులకు దీపావళి బోనస్… రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్

బచ్చలికూర జ్యూస్ ;

బచ్చలికూర గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది విటమిన్ కె యొక్క మూలం. దీనిలో నైట్రేట్లలో కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు ధమనులను రక్షించడం ,రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. బచ్చలికూర జ్యూస్ శరీరాన్ని , గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ జ్యూస్ ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

READ ALSO : Eating Too Much Fish : చేపలను ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావంపడుతుందా ?

బ్రోకలీ జ్యూస్ ;

బ్రోకలీలో ఉండే కెరోటినాయిడ్స్ ల్యూటిన్ గుండె ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంగా దీనిని తీసుకోవటం వల్ల గుండెపోటు, ఇతర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే పొటాషియం కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగనివ్వదు. బ్రోకలీతో చేసిన సూప్ తీసుకుంటే గుండెను జాగ్రత్తగా ,ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

READ ALSO : Monsoon Tips : వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి చిట్కాలు !

దోసకాయ జ్యూస్ ;

వేసవిలో దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది. దోసకాయలో 95 శాతం నీరు, పీచు ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె జబ్బులను నివారిస్తుంది.

READ ALSO : Poor Dental Health : దంతాల శుభ్రత సరిగా లేకుంటే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ? అధ్యయనం ఏంచెబుతుందంటే ?

పుదీనా రసం :

తాజా పుదీనా సువాసన ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ కె లభిస్తాయి. దీని జ్యూస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.