Eye Health : కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు

కంటి ఆరోగ్యంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సి , ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ , లుటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి.

Eye Health : కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు

eyes healthy

Eye Health : డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్ల ముందే గడుపుతుండటం వల్ల ఈ పరిస్ధితి దీర్ఘకాలంలో కంటి ఆరోగ్యంపై పడుతుంది. దీని వల్ల అస్పష్టమైన దృష్టి, కళ్ళు పొడిగా మారటం, అలసటతోపాటు అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది.

READ ALSO : Better Eyesight : మెరుగైన కంటిచూపు కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

అయితే కొన్ని రకాల మెళుకువలు, జాగ్రత్తలు, కంటి వ్యాయామాలు, UV రక్షణగా అద్దాలు, ఆహారపు అలవాట్లను అనుసరించటం ద్వారా కంటి చూపు దెబ్బతినకుండా చూసుకోవటం సాధ్యమవుతుంది. డిజిటల్ ఒత్తిడిని నివారించడానికి ప్రతి 20 నిమిషాలకు కళ్ళకు చిన్న విరామం ఇవ్వాలి. సమతుల్య ఆహారం తీసుకోవటం ద్వారా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

ప్రస్తుత డిజిటల్ యుగంలో సుదీర్ఘంగా స్క్రీన్లను అదేపనిగా ఎక్కువ సమయం చూడంతోపాటుగా, దుమ్ము , కాలుష్యం కారకాల వల్ల కంటి సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించటం ద్వారా వాటిని అదిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి, డిజిటల్ ఒత్తిడిని దూరంగా ఉంచడానికి 5 సులభమైన చిట్కాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Increase Eyesight : కంటి చూపును పెంచుకునేందుకు దోహదపడే చిట్కాలు !

1. 20-20-20 నియమాన్ని అనుసరించటం ;

డిజిటల్ స్క్రీన్‌ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కంటి పై ఒత్తిడి పడుతుంది. అస్పష్టమైన దృష్టి, పొడి కళ్ళు, తలనొప్పి, అలసటగా ఉత్పన్నం అవుతుంది.. దీన్ని తగ్గించడానికి, ప్రతి 20 నిమిషాలకు, 20 సెకన్ల కు విరామం తీసుకోవాలి. అదే సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూసేందుకు ప్రయత్నించాలి. ఇలాంటి సాధారణ వ్యాయామం కంటి కండరాల్లో సడలింపునిస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.

2. UV రక్షణతో కూడిన సన్ గ్లాసెస్ ధరించటం ;

సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలు కళ్ళకు హాని కలిగిస్తాయి. కంటిశుక్లం వంటి ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఎండ రోజుల్లో, మేఘావృతమైన రోజులలో బయటకు వచ్చినప్పుడు 100% UVA, UVB కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ధరించాలి. అన్ని కోణాల నుండి కళ్లను రక్షించే సన్ గ్లాసెస్ ను ఎంచుకోవాలి.

READ ALSO : కంటి చూపు దెబ్బతినకుండా ఉండాలంటే..

3. సమతుల్య ఆహారం తీసుకోవటం ;

కంటి ఆరోగ్యంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సి , ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ , లుటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో సిట్రస్ పండ్లు, ఆకు కూరలు, గింజలు, గింజలు, చేపలు గుడ్లు ఉండేలా చూసుకోవాలి. అవి కంటి చూపుకు మాత్రమే కాకుండా, వయస్సు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

4. హైడ్రేటెడ్ గా ఉండటం ;

నీరు సరిగా తీసుకోకపోవటం వల్ల కళ్ళు పొడిబారతాయి. కళ్ళు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి తగినంత నీరు తీసుకోవాలి. అలాగే, కెఫిన్ , ఆల్కహాల్ పానీయాలను నివారించటం మంచిది. ఎందుకంటే అవి డీహైడ్రేషన్ మరింత తీవ్రతరం చేస్తాయి.

READ ALSO : Coconut Flower : కంటి చూపు లోపాలను దరిచేరకుండా చేసే కొబ్బరి పువ్వు! వారానికి ఒకసారి తింటే చాలు

5. పరిశుభ్రత పాటించటం ;

కళ్ళను తాకడం, కాంటాక్ట్ లెన్స్‌లను తాకటం వంటి చేయబోయే ముందు చేతులను కడుక్కోవాలి. కాంటాక్ట్ లెన్స్ కేస్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ప్రతి మూడు నెలలకోసారి దాన్ని మార్చాలి. కంటికి చికాకు కలిగించే దుమ్ము, దూళి వంటివి కళ్ళలో పడకుండా చూసుకోవాలి. రాత్రి సమయంలో మేకప్‌ను తీసివేయాలి.

కంటి చూపును కాపాడుకోవడానికి ఈ అలవాట్లను దినచర్యలో చేర్చుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కంటికి సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తిస్తే వెంటనే నేత్ర వైద్యుని సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈసమాచారం అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.