Better Eyesight : మెరుగైన కంటిచూపు కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

కంప్యూటర్ తెర మధ్యబాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది. రెప్ప వేయకుండా పనిచేయడం మంచిది కాదు. మధ్యమధ్యలో రెప్పలు కొడుతూ ఉండాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి.

Better Eyesight : మెరుగైన కంటిచూపు కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

Experts recommend some precautions for better eyesight!

Better Eyesight : ఆధునిక జీవనశైలి కళ్లపైన అధిక ప్రభావం పడుతోంది. రోజులో ఎక్కువసమయం కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు , సెల్ ఫోన్ , టీవీల ముందు గడపాల్సి వస్తోంది. వీటికి తోడు ఇతర కారణాల వల్ల కంటి చూపుతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు పాటించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దం..

పుస్తకాలు చదివేటప్పుడు : చిన్నారుల నుండి, పెద్దల వరకు చాలా మంది రోజువారిగా చదవటం అన్నది అలవాటుగా ఉంటుంది. చదివే సందర్భంలో పుస్తకం 30సె. మీ. దూరంలో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చుని చదవాలి. పడుకుని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి. కదులుతున్న కుర్చీలో కూర్చుని చదివితే కళ్ళకు శ్రమకలుగుతుంది. కాబట్టి కళ్లకు శ్రమ కలగకుండా చదవటం అవసరం.

టి.వి చూసే సందర్భంలో ; ఒక గంటకు మించి టి.వి. చూడటం మంచిది కాదు. టి.వి. చూసే సమయంలో శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలమందికి అలవాటు. అయితే వెన్నెముకకి ఊతమిచ్చేలా కూర్చుని టి.వి. చూడటం కంటికి మేలు చేస్తుంది. టి.వి. కి కనీసం 3 మీటర్లు దూరం ఉండాలి. చీకటి గదిలో కూర్చుని టి.వి. చూడటం కంటికి శ్రేయస్కరం కాదు. వెలుతురు సరిపడా ఉండాలి. లైటు టి.వి. వెనుక వైపు ఎత్తులో ఉంటే మంచిది.

కంప్యూటర్ ముందు ఉన్నప్పడు : కంప్యూటర్ తెర మధ్యబాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది. రెప్ప వేయకుండా పనిచేయడం మంచిది కాదు. మధ్యమధ్యలో రెప్పలు కొడుతూ ఉండాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. దృష్టి తీక్షణంగా ఉండరాదు. కాంతి వంతంగా కనిపించేలా మోనిటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మోనిటర్ మీద యాంటీగ్లేర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుంటే కంటిపై అంతగా ప్రభావం ఉండదు.

వాహనాలు నడిపే సమయంలో : పగటిపూట బండి నడిపేటప్పుడు సన్ గ్లాస్ వాడాలి. సూర్యనినుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు, యు.వి. కిరణాల తాకిడికి కళ్ళకు హాని కలగకుండా దుమ్ము, దూళి పడకుండా కళ్ళకు రక్షణ కల్పిస్తాయి. రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటీగ్లేర్ గ్లాస్ వాడాలి. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కలిగిస్తాయి.