Increase Eyesight : కంటి చూపును పెంచుకునేందుకు దోహదపడే చిట్కాలు !

ఇటీవలికాలంలో దాదాపు 100 మందిలో 99 మంది కళ్లు పొడిబారడం, ఎర్రబడడం వంటి లక్షణాలు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ పరికరాలను నిరంతరం ఉపయోగించే అలవాటు కళ్ళకు హాని కలిగించడమే కాకుండా ప్రాణాంతకమైన పరిణామాలకు దారితీస్తుంది.

Increase Eyesight : కంటి చూపును పెంచుకునేందుకు దోహదపడే చిట్కాలు !

increase eyesight

Increase Eyesight : ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల విస్తృత వినియోగం, ఆన్‌లైన్ చదువులు, గేమింగ్‌తో, అన్ని వయసుల వారిలో కళ్ళు బలహీనపడి కంటి చూపు తగ్గిపోయి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎదిగే వయస్సున్న చిన్నారుల్లో కళ్లను కాపాడుకోవటం అన్నది పెద్ద సవాలుగా మారింది. చిన్నవయస్సులోనే కళ్లజోళ్ల్ళు ధరించాల్సి పరిస్ధితులు ఏర్పడుతున్నాయి.

READ ALSO : కంటి చూపు కాపాడుకోండిలా..

ఇటీవలికాలంలో దాదాపు 100 మందిలో 99 మంది కళ్లు పొడిబారడం, ఎర్రబడడం వంటి లక్షణాలు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ పరికరాలను నిరంతరం ఉపయోగించే అలవాటు కళ్ళకు హాని కలిగించడమే కాకుండా ప్రాణాంతకమైన పరిణామాలకు దారితీస్తుంది.

జీవనశైలిలో మార్పులు, మంచి పోషకాహారం తీసుకోకపోవటం కూడా కంటి వ్యాధుల పెరుగుదలకు కారణమవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, పిల్లలు సాధారణంగా నిమిషానికి 18 నుండి 22 సార్లు రెప్పవేయవలసి ఉండగా, సెలఫోన్ లు , కంప్యూటర్లు చూడటం ఎక్కువకావటంతో 50 శాతం తక్కువగా రెప్పలు వేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. మంచి అలవాట్లను అలవర్చుకోవడం వల్ల కళ్లను ఆరోగ్యంగా రక్షించు ఉంచుకోవచ్చు. కంటి సమస్యల విషయంలో, యోగా , ఆయుర్వేదం వంటి పరిష్కారాలు చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

READ ALSO :  Coconut Flower : కంటి చూపు లోపాలను దరిచేరకుండా చేసే కొబ్బరి పువ్వు! వారానికి ఒకసారి తింటే చాలు

కంటి చూపును మెరుగుపరుచుకోవటానికి ;

ఉదయం , సాయంత్రం 30 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. మహాత్రిఫల ఘృత ను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పాలతో కలిపి దీనిని 1 స్పూన్ తీసుకోవాలి. భోజనం తర్వాత రోజుకు రెండుసార్లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా-ఉసిరికాయ రసం త్రాగాలి. ఉసిరి కళ్లకు మేలు చేస్తుంది. రోజ్ వాటర్‌లో త్రిఫల చూర్ణం, కొన్ని నీటిని కలపాలి. త్రిఫల-రోజ్ వాటర్‌తో మీ కళ్లను కడుక్కోవాలి.

READ ALSO : Kharbuja Benefits : ఒక్క పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! మలబద్ధకాన్ని నివారించటంతోపాటు, కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు

కంటి చూపు కోసం ఏమి తినాలి?

కంటిచూపు మెరుగుపడేందుకు ఎండుద్రాక్ష,అత్తి పండ్లను తీసుకోవాలి. నీటిలో నానబెట్టిన 7-8 బాదంపప్పులను ప్రతిరోజు తీసుకోవాలి. కారెట్, పాలకూర, బ్రోకలీ, చిలగడదుంప, స్ట్రాబెర్రీ వంటివి తీసుకోవటం ద్వారా కంటి చూపు తగ్గటం వంటి సమస్యలను తొలగించుకోవచ్చు. బాదం, సోపు, పంచదార మెత్తగా చేసుకుని రాత్రి గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.