Diwali bonus : టీ ఎస్టేట్ ఉద్యోగులకు దీపావళి బోనస్… రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్

Diwali bonus : ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీపావళి బోనస్ గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అందజేసి వారిని సంతోషంలో ముంచెత్తిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం వెలుగుచూసింది....

Diwali bonus : టీ ఎస్టేట్ ఉద్యోగులకు దీపావళి బోనస్… రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్

Royal Enfield bikes

Diwali bonus : దీపావళి వస్తుందంటే చాలు ఉద్యోగులు యజమానులు ఇచ్చే దీపావళి బోనస్ లతో పండుగను సంతోషంగా చేసుకుంటుంటారు. ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీపావళి బోనస్ గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అందజేసి వారిని సంతోషంలో ముంచెత్తిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం వెలుగుచూసింది. తమిళనాడులోని కోటగిరి పట్టణంలోని ఒక టీ ఎస్టేట్ యజమాని పి శివకుమార్ తన ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను దీపావళి బోనస్‌గా అందించారు.

Also Read : Onions : మొబైల్ వాహనాల్లో సబ్సిడీ ఉల్లి విక్రయం…కిలో ధర ఎంతంటే…

టీ ఎస్టేట్ యజమాని శివకుమార్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల తాళాలను తన ఉద్యోగులకు అందజేసి వారితో కలిసి రైడ్‌కు వెళ్లి ఆనందాన్ని పంచుకున్నారు. దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు గిఫ్ట్ వోచర్‌లు, ప్రోత్సాహకాలు లేదా స్వీట్‌లను అందజేస్తుంటాయి కానీ టీ ఎస్టేట్ యజమాని ఏకంగా రెండు లక్షల రూపాయలకు పైగా విలువ చేసే బైక్ లను అందించారు. టీ ఎస్టేట్‌లో గత రెండు దశాబ్దాలుగా 627 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Also Read : Khalistani terrorist : నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు…ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజా హెచ్చరిక

తన మేనేజర్, సూపర్‌వైజర్, స్టోర్ కీపర్, క్యాషియర్, ఫీల్డ్ స్టాఫ్, డ్రైవర్‌లతో సహా 15 మంది ఉద్యోగులకు బైక్‌లను బహుమతిగా ఇచ్చారు. టీ ఎస్టేట్ అభివృద్ధికి బాగా పనిచేసిన వారికి కొత్త బైక్ లు ఇవ్వడంతోపాటు ఉద్యోగులతో కలిసి నవంబర్ 12వతేదీన తాము దీపావళి జరుపుకుంటున్నామని టీ ఎస్టేట్ అధినేత శివకుమార్ చెప్పారు.