Khalistani terrorist : నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు…ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజా హెచ్చరిక

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 19వతేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేశారు....

Khalistani terrorist : నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు…ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజా హెచ్చరిక

Khalistani terrorist Gurpatwant Singh

Khalistani terrorist : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 19వతేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేశారు. నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మూసివేస్తామని గురుపత్యంత్ సింగ్ హెచ్చరించారు. నవంబర్ 19 వతేదీన ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించడానికి ప్లాన్ చేస్తున్న వ్యక్తులకు వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆయన బెదిరించారు.

Also Read : Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భూకంపం తీవ్రత ఎంతంటే…అయోధ్యలోనూ భూప్రకంపనలు

‘‘నవంబర్ 19వతేదీన ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. గ్లోబల్ దిగ్బంధనం ఉంటుంది. నవంబర్ 19వతేదీన ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు, లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’’ అని పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

Also Read : PM Modi : నవంబర్ 7న తెలంగాణకు మోదీ.. ప్రధాని అధికారిక షెడ్యూల్ ఇదే

నవంబర్ 19వతేదీన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం మూసివేస్తారని, దాని పేరు మారుస్తామని పన్నూన్ పేర్కొన్నారు. నిషేధిత యూఎస్ ఆధారిత సిక్కుల ఫర్ జస్టిస్ సంస్థకు చీఫ్‌గా పన్నూన్ వ్యవహరిస్తున్నారు. పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు అక్రమ ఆక్రమణలో ఉన్న వ్యక్తులు ప్రతిస్పందిస్తారని ఆయన చెప్పారు. అమృత్‌సర్‌లో జన్మించిన పన్నూన్ పై 2019వ సంవత్సరంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొదటి కేసును నమోదు చేసింది.

Also Read : ODI World Cup 2023 : వరల్డ్ కప్ మ‌న‌దేనా..? రోహిత్ శ‌ర్మ‌ను ప్ర‌శ్నించిన ఫ్యాన్‌.. స‌మాధానం ఏంటో తెలుసా..?

అతని బెదిరింపుల ద్వారా పంజాబ్, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో భయాందోళనలను వ్యాప్తి చేశారు. 2021 వ సంవత్సరం ఫిబ్రవరి 3వతేదీన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నూన్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29వతేదీన అతన్ని ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించింది.