PM Modi : నవంబర్ 7న తెలంగాణకు మోదీ.. ప్రధాని అధికారిక షెడ్యూల్ ఇదే
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.

PM Modi Telangana tour (1)
PM Modi Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ గర్జన సభలో మోదీ పాల్గొననున్నారు. మంగళవారం సాయంత్రం 5.05గంలకు యూపీ ప్రయాగ్ రాజ్ నుంచి బేగంపేట్ కు మోదీ రానున్నారు.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.
సాయంత్రం 6.15గంటలకు రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం 6.35గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.