Onions : మొబైల్ వాహనాల్లో సబ్సిడీ ఉల్లి విక్రయం…కిలో ధర ఎంతంటే…

దేశంలో ఆకాశన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. కేంద్రం కిలో ఉల్లిని రిటైల్ గా 25రూపాయలకే విక్రయిస్తోంది....

Onions : మొబైల్ వాహనాల్లో సబ్సిడీ ఉల్లి విక్రయం…కిలో ధర ఎంతంటే…

Onions

Onions : దేశంలో ఆకాశన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. కేంద్రం కిలో ఉల్లిని రిటైల్ గా 25రూపాయలకే విక్రయిస్తోంది. అవుట్ లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని కేంద్రం విక్రయిస్తోంది. ఖరీఫ్ పంట రాకలో జరిగిన జాప్యం వల్ల ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతి ధర మెట్రిక్ టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. అనంతరం బఫర్ సేకరణలో భాగంగా 5.06 లక్షల టన్నుల ఉల్లిని కేంద్రం సేకరించింది.

Also Read : Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భూకంపం తీవ్రత ఎంతంటే…అయోధ్యలోనూ భూప్రకంపనలు

ఉల్లిని వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు, వినియోగదారుల వ్యవహారాల శాఖ వివిధ ఔట్‌లెట్‌లు, మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఉల్లిపాయల రిటైల్ అమ్మకాలను ప్రారంభించిందని పత్రికా ప్రకటన తెలిపింది. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్,ఇతర రాష్ట్ర-నియంత్రిత సహకార సంస్థలు ఉల్లిని సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నాయి.

Also Read : Khalistani terrorist : నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు…ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజా హెచ్చరిక

దేశంలోని 21 రాష్ట్రాల్లో నాఫెడ్ 329 ఉల్లి రిటైల్ కేంద్రాలను ప్రారంభించింది. ఎన్సీసీఎఫ్ 20 రాష్ట్రాల్లో 457 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రీయ భండార్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఉల్లి రిటైల్ విక్రయాలను ప్రారంభించింది. దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ అసోసియేషన్ వినియోగదారులకు ఉల్లిపాయల రిటైల్ విక్రయాలను విక్రయించనుంది.రబీ, ఖరీఫ్ పంటల మధ్య ధరల హెచ్చుతగ్గులను నిర్వహించడానికి ప్రభుత్వం ఉల్లి బఫర్‌ను నిర్వహిస్తుంది.

Also Read : Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన పోటీ.. మరో రెండు సీట్లపై బీజేపీతో చర్చలు : పవన్ కళ్యాణ్

గత ఏడాది 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లి ఉండగా ఈ ఏడాది బఫర్‌ పరిమాణాన్ని 7 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచినట్లు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని లాసల్‌గావ్ మార్కెట్‌లో ఉల్లి ధరలు అక్టోబర్ 28వతేదీన క్వింటాల్‌కు రూ. 4,800 నుంచి నవంబర్ 3న క్వింటాల్‌కు రూ.3,650కి 24 శాతం క్షీణించింది. సబ్సిడీ ఉల్లి విక్రయాలు ఫలితాలను చూపించడం ప్రారంభించాయి.

Also Read : PM Modi : నవంబర్ 7న తెలంగాణకు మోదీ.. ప్రధాని అధికారిక షెడ్యూల్ ఇదే

టమోటా మార్కెట్‌లో సరఫరాలో అంతరాయం కారణంగా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ జోక్యం చేసుకుంది. ప్రభుత్వం టమోటాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి సేకరించి వినియోగదారులకు అధిక రాయితీ ధరలకు అందించింది. దీంతో టమాటా రిటైల్ ధరలను గణనీయంగా తగ్గాయి. భారత్ దళ్ వివిధ సహకార సంస్థల ద్వారా సైనిక, పారామిలిటరీ దళాలకు ఉల్లిని సబ్సిడీ ధరలకు సరఫరా చేయనుంది.