Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన పోటీ.. మరో రెండు సీట్లపై బీజేపీతో చర్చలు : పవన్ కళ్యాణ్
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు.

Pawan Kalyan Kishan Reddy Meeting
Pawan Kalyan – Kishan Reddy : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని తెలిపారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు. రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది. దీనిపై మరోసారి సమావేశమై మాట్లాడుకుంటామని తెలిపారు. తమ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల ఎన్డీయే సమావేశంలో కూడా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడామని తెలిపారు. ఈ దేశానికి ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలన్నారు. నవంబర్ 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు తనను ఆహ్వానించారని, పాల్గొంటానని చెప్పారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ తమకు జీహెచ్ఏంసీ ఎన్నికల్లో ఎంతో సహకరించిందన్నారు. అందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి అన్నారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందని తెలిపారు. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పేర్కొన్నారు. రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉందన్నారు.
Janasena : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదించిన జనసేన
నవంబర్ 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించామని పేర్కొన్నారు. డా.లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందన్నారు. ఈ దేశానికి మరోసారి మోదీ ప్రధాన మంత్రి కావల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తమ భాగస్వామ్య పక్షంగా జనసేన మద్దతుతో తెలంగాణ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.